ఫోకస్

అమాయకులపై ఉగ్రవాద ముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న మారణహోమం మొత్తానికి తీవ్రవాదం, ఉగ్రవాదం కారణమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఉగ్రవాదం, తీవ్రవాదం ముసుగులో అమాయకులైన పౌరులను పోలీసులు అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా సంబంధంలేని వారిని ఈ కేసులలో ఇరికిస్తున్నారు. మత, వామపక్ష తీవ్రవాదం ఏ వాదమైనా సరే హింసను అందరు ఖండించాల్సిందే. ఏ సమాజంలోనైనా హింసకు తావులేదు. కాశ్మీర్ సమస్య ఈనాటిది కాదు. కాశ్మీర్ సంస్థానాన్ని మనదేశంలో విలీనం చేసే సమయంలోనే నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశం విడిచిపెట్టి పోవటానికి ప్రజలందరూ అంగీకరిస్తే ఎప్పటికైనా సాధ్యమవుతుందంటూ ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే తరువాత వచ్చిన ప్రధానమంత్రులెవరూ కూడా కాశ్మీర్ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించకుండానే అక్కడ జరుగుతున్న ఉద్యమాలపై అణచివేతతో ముందుకు సాగటం వల్లనే ప్రస్తుతం మారణహోమం పెచ్చరిల్లుతోంది. ఇక మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాలతో కూడిన భారత ఈశాన్య రాష్ట్రాల్లో 1959 నుంచి కూడా సైనిక బలగాల చట్టం అమల్లో వుండటం వల్లనే ఆ ప్రాంత ప్రజలు స్వయం పరిపాలనకోసం ఉద్యమాలు సాగిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఉద్యమాలను సైనికులు అణచివేసే పద్ధతుల్లో ముందుకు సాగుతుండటం వల్ల అక్కడ మరోవిధమైన మారణహోమం సాగుతోంది. ఇక చత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కనిపిస్తున్న ఉగ్రవాదం మావోయిస్టు పార్టీకి సంబంధించినదిగా ప్రచారం సాగుతోంది. అయితే వాస్తవానికి అక్కడున్న సహజ వనరులను పాలకులు పెట్టుబడిదారీ శక్తులకు కట్టబెట్టి దశాబ్దాల తరబడి ఆ ప్రాంతాలను నమ్ముకున్న గిరిజనులను వెళ్లగొట్టే ప్రయత్నాలను అడ్డుకుంటున్నందునే మావోయిస్టు పార్టీ సభ్యులను ఉగ్రవాదులనే ముద్రవేస్తున్నారు. అసలు ఈ సహజ వనరులను ప్రభుత్వమే వినియోగించుకుని ఆ ప్రాంత గిరిజనుల భాగస్వామ్యంతో వారిని కూడా అభివృద్ధి పథంలో పయనింపచేసే ఆలోచన చేస్తే ఆ ప్రాంతంలో తీవ్రవాదాన్ని రూపుమాపటం అంతపెద్ద కష్టమేమీకాదు. దేశంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకుని వాటిని అమలు చేయటం సమంజసంగా వుంటుంది.

- టి ఆంజనేయులు పౌరహక్కుల సంఘం, కృష్ణా జిల్లా అధ్యక్షుడు.