ఫోకస్

హోదా వచ్చేవరకు పోరాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రత్యేక హక్కు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో చెలగాటమాడుతున్నాయి. వైకాపా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రత్యేక హోదా సాధించేంతవరకు విశ్రమించదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఆంధ్రకు తరలివస్తాయి. పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికే రెండేళ్లు గడచింది. ప్రత్యేక హోదా సాధనలో టిడిపి ఘోరంగా విఫలమైంది. ఒకసారి ప్రత్యేక హోదా సంజీవని కాదని, మరొకసారి ప్యాకేజీ వస్తుందని చంద్రబాబు మాట మార్చారు. తడవకో మాట మార్చుతూ ప్రజలను ముంచారు. హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ 16వేల కోట్ల రెవెన్యూ లోటులో కూరుకుపోయింది. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా మళ్లీ ఆంధ్రాలో ప్రవేశించేందుకు ప్రైవేట్ బిల్లు రూపంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. మా పార్టీ అధినేత జగన్ రెండేళ్లుగా పలు ఉద్యమాలు, దీక్షలు, నిరసనలు చేపట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేరిస్తే ఈ సమస్య ఉండేదికాదని బిజెపి అంటోంది. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంత హడావుడిగా బిల్లును పాస్ చేయించుకుంది. ఈ పాపంలో బిజెపి, కాంగ్రెస్‌కు భాగస్వామ్యం లేదా? ఆ రోజు ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ఎందుకు అంచనా వేయలేదు? ఎంతసేపు విభజన చేసి చేతులు దులుపుకుందామని చూశారు. వైకాపా ప్రత్యేక హోదా సాధనకు మడమతిప్పకుండా రాజీపడకుండా పోరాడుతుంది. అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా ఏపి శాసనసభాపక్ష ఉపనేత