ఫోకస్

పార్లమెంట్ మాటకే విలువ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతి బలమైన ప్రజాస్వామ్య దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్‌లో ఇచ్చిన మాటకు విలువలేక పోవడం దారుణం. మేము కోరుకోని విభజనను బలవంతంగా చేసిన సమయంలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రకటన చేశారు. ఆయన ఐదేళ్లు ఇస్తామంటే, కాదు.. పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గట్టిగా తమ వాదనలు వినిపించారు. ఇప్పుడు మాటమార్చి ఆర్థికపరమైన అంశం అని కుంటి సాకులు చెప్పడం దారుణం. ఏపికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల సమయంలో రాష్ట్ర పర్యటనలో బలంగా వినిపించి, ఇక్కడి ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయేలా చేశారు. ఇప్పుడు మాటమారిస్తే విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితే బిజెపికి దాపురిస్తుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రతిపక్షాల స్వరం సైతం హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉండాలేకాని రాష్ట్రంలో తమ రాజకీయ ఉనికికోసం టిడిపిపైనో, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనో ఎదురుదాడికి దిగడం సరికాదు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఏ త్యాగానికైనా టిడిపి నాయకత్వం, నాయకులు సిద్ధంగా ఉన్నారు. కేంద్రంలో పదవులు టిడిపికి కొత్తకాదు. గతంలో ప్రధాని పదవిని సైతం చంద్రబాబు వదులుకున్నారు. కేవలం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఒకేఒక్క కారణంతో ప్రధాని పదవిని త్యాగం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు తమ పదవులు వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి, మనకు రావాల్సిన నిధులకోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో చివరివరకు హోదాకోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం మాపై ఎంతో ఉంది. అంతేగాని పదవులకు, రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు. మిత్రపక్షంగా ఉన్నాం కనుక సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నాం. అయితే రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగే పరిస్థితి వస్తే మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మిత్రపక్షంగా ఉన్న టిడిపికి బిజెపి విలువిచ్చి ఏపికి న్యాయం చేయాలి. ఏపి ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం కేంద్రంపై ఉందనే విషయాన్ని బిజెపి నేతలు గుర్తించాలి.

- గంటా శ్రీనివాసరావు ఏపి మానవవనరుల శాఖ మంత్రి