ఫోకస్

సమయం పడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభాషను వదిలి ఆంగ్లమోజులో పడిపోవడానికి కారణమైన మూలాలలను అనే్వషించే తపన ప్రభుత్వానికి గాని, మేథావులకు గాని లేకుండా పోయింది. అందరూ డిమాండ్ చేయడమే తప్ప ఈ పరిస్థితికి వాస్తవిక కారణాలు ఏమిటో అధ్యయనం చేసే ఓపిక లేదు, ఇంగ్లీషులో చదవడం అంటే అదో సామాజిక హోదాగా భావిస్తున్నారు. ఇంగ్లీషే ఒక గీటురాయిగా మారిందనే అపోహ నుండి తల్లిదండ్రులు బయటపడాలి. దొరకొడుకైనా, బీదవాడైనా ఒకే విధంగా ఉండాలనే డ్రెస్ కోడ్ వచ్చింది. మాతృభాషలో అర్థమైనంత స్పష్టంగా వేరేభాషలో అర్థం కాదు, తల్లిదండ్రులు స్పష్టంగా ఉండాలి, ఇంగ్లీషు మీడియంతోనే సమాజం బాగుపడుతందనే దానితో నేను ఏకీభవించడం లేదు, సమాజంపట్ల ఆలోచించేవారు, చదువుకునేవారు రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఎటు చూసినా టెన్షన్ ఉంటోంది, గతాన్ని తర్కించుకోకపోతే ఈ సమస్యల నుండి తప్పించుకోలేం, ఏనాటికైనా గతమే గొప్పదని తెలుసుకుంటాం. టెన్షన్ లేని సమాజమే గొప్పది, తరిగిపోతున్న మానవ విలువలను కాపాడటమే ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. రోడ్లు నిర్మించడంతో, అభివృద్ధి పనులతో ప్రభుత్వ బాధ్యత తీరిపోదు, మానవ విలువలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది, మానవ విలువలను కాపాడటం మాతృభాషలో బోధనతోనే సాధ్యపడుతుంది. చదువంటే శ్రీచైతన్య, నారాయణలో చదవడం కాదు, ప్రభుత్వంతోపాటు అందరూ మేల్కొవాలి. తెలంగాణ ప్రభుత్వం రెండు విషయాలు నమ్ముకుంది. ఒకటి చదవు, రెండోది మానవ సంపద, విద్యపై పెట్టే ప్రతిపైసా వ్యయాన్ని పెట్టుబడిగా మా ప్రభుత్వం భావిస్తోంది. ఇంగ్లీషు మీడియం వ్యామోహం నుండి బయటపడానికి కొంత సమయం పడుతుంది.

- ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి, తెలంగాణ