ఫోకస్

ఆంగ్లంపై మోజెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా చదువులు కనీసం తెలుగు ఒక బోధనాంశంగా కూడా లేకుండానే గడచిపోయే పరిస్థితుల్లో భాషాభిమానుల ఒత్తిడితో ఇటీవలె తెలుగును నిర్బంధ భాషాంశంగా ప్రభుత్వం చేర్చింది. తాజాగా అన్ని స్కూళ్లను దశలవారీ ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రంలో 2000 సంవత్సరం నుండే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొద్దికాలానికి మోడల్ స్కూళ్ల పేరిట కొన్ని స్కూళ్లను ప్రయోగాత్మకంగా పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చివేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి, వీటికితోడు మోడల్ స్కూళ్లు వచ్చాయి. ఆ ప్రయోగం పూర్తయిన తర్వాత 2004లో తెలుగు మాధ్యమంలోని స్కూళ్లలోనే ఆంగ్ల మాధ్యమంతో తరగతులు మొదలయ్యాయి. అలా ఆంగ్ల మాధ్యమంతో మొదలైన క్లాసులను ఇపుడు రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చే ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో కెజి టు పిజి ఆంగ్ల మాధ్యమ బోధనపై కసరత్తు జరుగుతుండగా, ఆంధ్రాలో అన్ని స్కూళ్లనూ మోడల్ స్కూళ్లుగా మార్చాలని చూస్తున్నారు.
దీనికి ప్రభుత్వం చెప్పేది ఒక్కటే... డబ్బున్న వారి పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మాద్యమంలో చదువుతూ ఐటిసహా వివిధ రంగాల్లో బాగా రాణిస్తుంటే పేదలు, సామాన్యుల పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదవాలా అని అడుగుతున్నారు. తెలుగు మీడియంలో చదివితే రాణించలేరా... రాణిస్తున్నవారంతా ఆంగ్ల మాద్యమంలో చదివిన వారేనా... అమెరికా పోవాలంటే ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిందేనా... ఆంగ్లం నేర్చుకోవడం వేరు, ఆంగ్లమాధ్యమంలోనే చదవాలనుకోవడం వేరు, తెలుగు మాధ్యమంలో చదువుతూ కూడా ఆంగ్లంతో పాటు నాలుగైదు విదేశీ భాషలు, భారతీయ భాషలూ నేర్చుకోవడం వేరు, ఈ గందరగోళంలో ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన రీతిలో వివరణ ఇస్తోందా? ఈ అయోమయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వం ఎందుకు భావించడం లేదు? స్వయంగా పార్లమెంటు సభ్యులే తాము ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని సిఫార్సు చేస్తున్నట్టు చెబుతున్నారు, ప్రజలు వచ్చి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తేనే తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపుతామని చెబుతుంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులు వచ్చి సంతకాలు పెట్టమంటే కాదని ఎలా చెప్పగలుగుతాం. ప్రజలు మారాలి, ప్రభుత్వం మారాలి, విద్యార్థులు అర్థం చేసుకోవాలి, మాతృభాషలో చదివినవారు సైతం అన్ని రంగాల్లో రాణించిన వాళ్లు ఎందరో ఉన్నారు. భారత మాజీ ప్రధాని పివి ననరసింహారావు సహా ప్రముఖులుగా చెప్పుకుంటున్న ఎందరో మాతృభాషలో విద్యాభ్యాసం చేసినవారే. పరిశ్రమ ఆంగ్ల మాద్యమంలో చదివిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయనేది మరో అపోహ. నిజానికి అమెరికాలో ఉద్యోగాలకు వెళ్తున్నది ఎంతమంది? అమెరికాసహా విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నది ఎంతమంది? వారి పేరుతో స్కూళ్లన్నీ ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోవల్సిందేనా? అసలు ఆంగ్లం నేర్చుకోవద్దని అంటున్నది ఎవరు? ఆంగ్లమే ఎందుకు నేర్చుకోవాలి, ఆంగ్లంతోపాటు హిందీ, స్పానిష్, ఇటాలియన్, అరబిక్, ఫ్రెంచి, లాటిన్ వంటి భాషలు కూడా ఎందుకు నేర్చుకోకూడదు?
విద్యారంగంలో కృషి చేస్తున్న పెద్దలంతా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రధానం చేసి విద్యాబోధన సాగాలని భావిస్తున్న తరుణంలో ప్రముఖులు తమ అభిప్రాయాలను ఆయా సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలకు మూలకారకుడు, విద్యారంగ వికాసానికి కృషిచేస్తున్న వెల్చాల కొండలరావు ప్రత్యేక లక్ష్యంతో మాతృభాషా పరిరక్షణకు ఒక ఉద్యమం రావాలని మాతృభాషా పరిరక్షణ సమాఖ్యను ఏర్పాటు చేశారు. అదే రీతిన ఆంధ్రాలోనూ కొంతమంది ముందుకు వచ్చి మాతృభాషా పరిరక్షణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటు తెలంగాణాలో వరంగల్, కరీంనగర్‌లోనూ అటు ఆంధ్రాలో విజయవాడ, రాజమహేంద్రవరం పట్టణాల్లో మాతృభాషపై ఉద్యమ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో మాతృభాషలో విద్యాబోధనపై ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.