ఫోకస్

మాటలెక్కువ.. చేతలు తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ ఎక్కువ మాట్లాడతాడు.. తక్కువ పనిచేస్తాడు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను యథాతథంగా ఎందుకు కొనసాగించడం లేదు? అవి పూర్తయితే గత పాలకులకు పేరు వస్తుందనే కదా! ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్ధి విషయంలో రాజకీయాలు పనికిరావు. కూచుంటే, నిలబడితే కెసిఆర్ కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామంటున్నాడు. ప్రాజెక్టు ఖర్చు పెంచేందుకే రీడిజైన్ చేస్తున్నారనిపిస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి, మేడిగడ్డ బ్యారేజీగా మార్చారు. దీనివల్ల 35వేల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం 80వేల కోట్లకు పెరిగింది. తొలుత చేపట్టిన ప్లాన్ ప్రకారం 100 టిఎంసిల నీటిని గ్రావిటీద్వారా ఉపయోగించుకునేందుకు వీలయ్యేది. ఇప్పుడు దీన్ని వెనక్కు జరపాలని నిర్ణయించడంతో 160 టిఎంసిల నీటిని ఎత్తిపోతలద్వారా సరఫరా చేయాల్సి వస్తోంది. విద్యుత్తు వినియోగం చాలా అవుతుంది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకోసం తొలుత వేసిన అంచనా వ్యయం ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే ఇప్పుడు దీని వ్యయాన్ని 45వేల కోట్ల రూపాయలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు జూరాల నుండి నేరుగా నీటిని తీసుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు మారిన పరిస్థితి దృష్ట్యా శ్రీశైలం నుండి నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎపి రాష్ట్రంతో తగాదా పెట్టుకున్నట్టు అవుతుంది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శాస్ర్తియ విధానం అమలు చేయడం లేదు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా తదితర ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేసేందుకు కేవలం 800కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నారాయణపేట, కొండగల్ ఎత్తిపోతల పథకాన్ని 1450కోట్లతో చేపడితే పూర్తవుతుంది. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి చెందేందుకు వీలయ్యేది. పైగా ఈ ఖర్చులో సగభాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- తమ్మినేని వీరభద్రం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి