ఫోకస్

చిగురించిన ‘హోదా’ ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై రోజురోజుకూ స్వపక్షం నుండి, టిడిపి నుండి పెరుగుతున్న ఒత్తిడితో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసంలో అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి సమావేశమై ఆంధ్రప్రదేశ్ పరిణామాలను సమీక్షించారు. ఇందులో ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశం, పోలవరం నిధులు, రైల్వే జోన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినా, ప్రధానంగా చర్చ అంతా ఆంధ్రప్రదేశ్‌కు హోదానా లేక ప్యాకేజీనా అనే విషయంపైనే జరిగింది. ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రత్యేక హోదాకు సంబంధించి కొన్ని నిబంధనలతో కేంద్రం ఇప్పటికే ముసాయిదా రూపొందించిందని కూడా చెబుతున్నారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని బిజెపి నేతలు చెబుతున్నారు. ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నాటినుండి ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌కు ఏయే పథకాలకు ఎంతమేరకు నిధులు ఇచ్చారో, రాబోయే నిధులు విషయంపై కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల కారణంగా ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని, ఆర్థిక ప్యాకేజీతోనే ఆంధ్రాకు లాభం చేకూరుతుందనే ప్రచారం ఎలా చేయాలనేది కూడా కేంద్రం యోచిస్తోంది. ఇంకోపక్క టిడిపి ఎంపిలు మాత్రం ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే దానిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యేక హోదాకోసం పవన్‌కల్యాణ్‌తోపాటు చిరంజీవిని కూడా తీసుకుని వెళ్లాలనే మరోవ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్న పార్టీలకు చెక్ చెప్పేందుకే జనసేన నేత పవన్‌కల్యాణ్‌ను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ మూడంచెల కార్యాచరణ ప్రకటించడం ఎవరికి అనుకూలమో తెలియని అయోమయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, విశే్లషకుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.