ఫోకస్

ప్రజల కోసమే జిల్లాల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు కానీ నాయకులకోసం కాదు. రెండు రాష్ట్రాలు మినహా దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలను పునర్విభజించాయి. జిల్లాల పునర్విభజన గురించి టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పింది. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే జిల్లాల విభజన. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుండి కొన్ని గ్రామాలు 200 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. 60-70 కిలో మీటర్ల దూరంలోనే కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల విభజనతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సులువు అవుతుంది. కలెక్టర్లు, ఎస్‌పి లాంటి ఉన్నతాధికారులు చేరువ అవుతారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు దోహద పడుతుంది. ఎప్పుడో జరగాల్సిన జిల్లాల విభజన ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చింది. ఎన్నికలకు ముందే జిల్లాల విభజన ఆవశ్యకతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగుర్తించారు. రాజకీయ కారణాలతో డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య లాంటి వారు దీక్షలు జరుపుతున్నారు. వీరి దీక్షల్లో రాజకీయ కుట్ర తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడానికి, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేసే విధంగా ప్రజల ముంగిట పాలన తెచ్చే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అరుణ, పొన్నాల వంటి వారి దృష్టిలో గద్వాల, జనగామ జిల్లాలు కాకపోతే జిల్లాల ఏర్పాటు శాస్ర్తింగా జరగడం లేదా? ప్రస్తుతం వనపర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, గద్వాల తదితర ప్రాంతాలు జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరివేసినట్టుగా ఉన్నాయి. ఈ దూరాన్ని 40 కిలో మీటర్లకు తగ్గించి, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. కొత్త జిల్లాగా ప్రతిపాదించిన వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కెటిఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను కూడా జిల్లాగా మార్చే ప్రతిపాదన లేదు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నాయకులు జిల్లాల విభజన తీరుపై ఒక అభిప్రాయం వ్యక్తం చేసి ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. దీక్షలు చేస్తున్న నాయకులు అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయం చెబితే బాగుండేది. జిల్లాల విభజనతో రాష్ట్రానికి మంచే జరుగుతుంది. ఈ విషయం త్వరలోనే విపక్షాలు గ్రహిస్తాయి.

- జూపల్లి కృష్ణారావు తెలంగాణ మంత్రి