ఫోకస్

ప్రజలకు పాలన మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభంగా ఉండటంతోపాటు పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుంది. దీనివల్ల అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేయడానికి దోహదం కలుగుతుంది. అలాగే అవినీతి, అక్రమాలు తగ్గుతాయి. శాంతిభద్రతల పర్యవేక్షణ పకడ్బందీగా జరగడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలనా పరిధి తగ్గడంవల్ల జిల్లా కలెక్టర్లకు ప్రతి కుటుంబంపై అవగాహన ఏర్పడానికి దోహదపడుతుంది. పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు చిన్న పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడం కూడా ఇందులో భాగమే. రాష్ట్రంలో ప్రస్తుతం ఒకే సారూప్యం, స్వభావం కలిగిన శాఖలు చాలా మటుకు ఉన్నాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. పని భారం తగ్గడం, ఒకే అధికారి పర్యవేక్షణలో సారూప్యశాఖలు ఉండటంవల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదం చేస్తుంది. కొన్ని దశాబ్దాల కింద ఏర్పడిన జిల్లాల వ్యవస్థ, మండలాల వ్యవస్థ ఏర్పడిన నాటికి ఇప్పటికి జనాభా బాగా పెరిగిపోయింది. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా మండలాల, రెవిన్యూ డివిజన్లు, జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయమే కాదు, ఎన్నికల ప్రణాళికలో తాము ప్రజలకు ఇచ్చిన హామీ కూడా. కొత్త మండలాల ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త మండలాల కోసం 75 డిమాండ్లు రాగా అందులో ఇప్పటికే 45 మండలాల ఏర్పాటుకు ముసాయిదా ఇవ్వడం జరిగింది. మిగిలిన 30 ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించి తుది నివేదిక ఇవ్వనున్నారు.

- మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రి (తెలంగాణ)