ఫోకస్

మరో ఉద్యమం రావలసిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాం కాలంలో నిరంకుశపాలన సాగినరోజుల్లో, రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వామపక్షాలు ప్రజాఉద్యమాన్ని తీసుకువచ్చాయి. నిజాంనిరంకుశపాలన నుండి ప్రజలను విముక్తుల్ని చేశాయి. ఇప్పుడు భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కార్పోరేట్ సంస్థల యజమానులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పేద ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మరో ప్రజాఉద్యమం రావలసి ఉంది. వామపక్షాలు ఇందుకోసం ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. రాజకీయాలు, రాజకీయ పార్టీల నేతలు ప్రజాసేవలో నిమగ్నం కావాలి. రాజకీయాలను నేరమయం చేయకూడదు. గతంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారు, భూస్వాములు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవారు కాదు. రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఆర్థిక సాయం చేసేవారు. వ్యాపారులు తదితరులు ఏవో ఆశించి పార్టీలకు ఫండ్ ఇచ్చేవారు. రాజకీయ పార్టీలు వారికి సాయం చేస్తే చేసేవి, లేకపోతే గమ్మున ఉండేవి. రాను రాను పారిశ్రామిక వేత్తలు తదితరులు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చేస్తున్నారు. దాంతో ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావం వారిలో కనిపించడం లేదు. అక్రమంగా డబ్బు సంపాదించాలన్న యావమాత్రమే వారిలో కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు పెట్టి టికెట్టు కొనుగోలు చేసే బడాపెట్టుబడిదారులు, డబ్బులు వెదచల్లి, ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. చట్టసభల్లో నీతివంతమైన నాయకులకు అవకాశం లేకుండా పోతోంది. కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి రకరాకాల వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వస్తున్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో భిక్ష వేసినట్టు కొన్ని పథకాలు ప్రారంభించి, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు అనుగుణంగా చట్టసభలను ఉపయోగించుకుంటున్నారు. చట్టాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి నేరస్తులు రావడంతో రాజకీయాలు కలుషితం అయ్యాయి. ఇటీవల నరుూం కేసు చూస్తే, ఏం జరుగుతుందో వెల్లడవుతోంది. నరుూంతో రాజకీయ నాయకులు, పోలీసులు తదితరులతో సంబంధాలు ఉన్నట్టు వెల్లడవుతోంది. అలాంటి వారి వల్లనే ప్రజాస్వామ్యం మంటకలిసిపోతోంది. నేరాలుపెరిగిపోతున్నాయి. రౌడీలు, గుండాలు అధికారంలోకి వస్తుండటంతో ప్రజాస్వామ్య విలువలకు స్థానం ఉండటం లేదు. ప్రజలను అడుక్కునే వారిలా మారుస్తూ, ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తూ, ప్రభుత్వ సొమ్మును నొక్కివేస్తున్నారు. ప్రభుత్వంపై ఆధారపడేలా సమాజాన్ని రూపొందిస్తున్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీకి స్థానం లేకుండా పోతోంది. పాలకపక్షాలే కార్పోరేట్ సంస్థల్లా మారిపోతున్నాయి. ఈ తరహా పరిస్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. దోపిడీ శక్తులను ఎదిరించేందుకు, దోపిడీ విధానాలను ఎండగట్టే విధంగా ప్రజాఉద్యమం రావలసి ఉంది. దోపిడీ శక్తుల ఆటలు కట్టించేందుకు ప్రజాఉద్యమం రావలసింది. దోపిడీశక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తే తప్ప, పరిస్థితులు చక్కబడే అవకాశం లేదనిపిస్తోంది. ప్రజలు ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యమం ప్రారంభించాలి. కుల, మత, ప్రాంతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి ఉంది. లౌకికవాదులంతా ముందుకు వచ్చి ప్రజాఉద్యమంలో భాగస్వాములు కావాలి.

-చెరుపల్లి సీతారాములు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు