ఫోకస్

రాజకీయాల్లో సంస్కరణలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరస్థులతో రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుంటే నేరస్థులతో సమానంగా శిక్ష పడేలా చట్ట సవరణ చేయాలి. అందుకు రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. సంస్కరణలు రానంతవరకూ ఈ పరిస్థితులు కొనసాగుతాయి. ఎంపి, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులుగా పోటీచేసే వారు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికైన తర్వాత సమాజ సేవ దేవడెరుగు కానీ, తాము ఎన్నికల్లో ఖర్చుచేసిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. అప్పుడు అవసరమైతే అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నరుూం లాంటి గ్యాంగ్‌స్టర్‌లతో సంబంధాలు పెట్టుకుంటే మరి కొందరు మాల్యావంటి వారితో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. రెండూ తప్పే. కొందరు గ్యాంగ్‌స్టర్ నరుూంతో పెట్టుకుంటే, వైట్‌కాలర్ నేరస్థుడైన మాల్యాతో పెట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో కోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు కాబట్టి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరించడం బాధాకరం, దురదృష్టకరం. ఈ మధ్య కొంతమంది నాయకులు గ్యాంగ్‌స్టర్ నరుూంతోగానీ, మాల్యాతోగానీ సంబంధాలు పెట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇవి బయటపడ్డాయి కాబట్టి తెలిసింది. ఇంకా బయటకు రానివి ఎన్ని ఉన్నాయో! ఇలా చేస్తూ నేర సమాజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. రాజకీయాల్లో 1) కులతత్వం, 2) నేరతత్వం, 3) వ్యాపారతత్వం, 4) మతతత్వం పెరిగిపోతున్నాయి. సమాజంలో మంచి పేరు ఉన్న వారిని, విద్యావంతులను, మేధావులను, సమాజ సేవ చేయాలన్న అంకితమైన భావం ఉన్నవారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించి ఎన్నికల్లో పోటీ చేయించాలన్న ఆలోచన చేయడం లేదు. కేవలం డబ్బు ఉన్నవారిని, రౌడీయిజం చేసేవారిని ప్రోత్సహిస్తున్నాయి. ఇది అందరినీ ఉద్ధేశించి కాదు కానీ కొందరు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవారు క్రిమినల్, ఆర్థిక నేరస్థులతో సంబంధాలు పెట్టుకుంటే వారితోపాటు శిక్ష పడేలా చట్ట సవరణ చేయాలి. అంతేకాకుండా వారు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా శిక్ష విధించాలి. రాజకీయాల్లో సంస్కరణలు తీసుకుని రావాలి. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగి మంచి కఠినతరమైన చట్టం తేవాల్సిన అవసరం ఉంది.

- శ్రవణ్ కుమార్ దాసోజు ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి