ఫోకస్

దర్యాప్తు ఏజన్సీలపై ఒత్తిడి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలు నేరగాళ్లను పొంచిపోషించే సంస్కృతిని విడనాడాలి. లేనిపక్షంలో ఆ నేరగాళ్లే కాలనాగులా తయారై సమాజాన్ని కాటేస్తారు. ఉదాహరణకు తెలంగాణలో నరుూమ్ చరిత్రనే చూడండి. నరుూమ్ పూర్వాశ్రమంలో నక్సలైట్. అతనిని లొంగదీసుకున్న పోలీసులు, ప్రభుత్వం స్వప్రయోజనాలకు వాడుకుంది. ఫలితంగా లబ్ధిని పొందారు. ఇక్కడ బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ కుమ్మక్కై ఒక నేరగాడిని చేరదీశాయి. రెండు దశాబ్దాల్లో నరుూమ్ సామ్రాజ్యం విస్తరించి సమాజానికి చేటుగా తయారయ్యాడు. ఈ పాపం నరుూమ్ ఒక్కడిదే అంటే కుదరదు. నరుూమ్‌కు సహకరించిన వారందరికీ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉన్నట్లే. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, పోలీసులు, సిబిఐ వ్యవస్థను తమ ఆధీనంలో, చెప్పుచేతుల్లో పెట్టుకుని విపక్ష పార్టీలు, తమకుగిట్టని నేతలు, వ్యక్తులు, సొంత పార్టీల్లో ఎదుగుతున్న వారిని ఇరకాటంలో పెట్టేందుకు, వారిని బెదిరించేందుకు, జీవితాలను నాశనం చేసేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో తమకు గిట్టనివారిపై అక్రమ కేసులు బనాయించి జనంలో క్రిమినల్‌గా చూపించడం సహేతుకం కాదు. తమిళనాడులో అధికారంలోకి వచ్చే పార్టీ ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు పోలీసులను వాడుకుంటుంది. గతంలో జయలలితను వేధించినందుకు, ఆమె ముఖ్యమంత్రి అయిన వెంటనే కురువృద్ధుడు కరుణానిధిని పోలీసుల చేత మోయించి అరెస్టు చేయించింది. ఈ తరహా దుష్ట సంప్రదాయాలు మెల్లిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఆంధ్రాలో కాపు సామాజికవర్గం ఎప్పటినుంచో తమను బిసిల్లో చేర్చాలని కోరుతోంది. ఆ డిమాండ్‌కు మద్దతు ఇచ్చినందుకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డికి సిఐడి చేత నోటీసులు ఇప్పించారు. తుని అల్లర్లకు, భూమనకు సంబంధం ఏముంది? వేధింపులు అంటే ఇవే. సిబిఐ, పోలీసు వ్యవస్థకు స్వేచ్చను ఇస్తే, రాజ్యాంగబద్ధంగా వారు నిర్వహించే విధులు నిర్వర్తిస్తే వీలైనంత వరకు రాజకీయాల్లో క్రిమినల్స్ తగ్గుతారు. బీహార్‌లో షాబుద్దీన్ ఉదంతం అందరికీ తెలిసిందే. రాజకీయాలు నేరమయం కాకుండా నిరోధించేందుకు కొత్తగా చట్టాలు అక్కర్లేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తే సరిపోతుంది. వీరప్పన్ అనే కలప దొంగకోసం తమిళనాడు, కర్నాటకలో ప్రాంతీయత, భాష పరంగా విడిపోయి ఉద్యమాలు నడిపోయాయి. రాజకీయ పార్టీలు సంకుచిత దృక్పథం ధోరణులకు స్వస్తి చెప్పాలి. అధికారం తమ వద్దే ఎప్పుడూ ఉండాలన్న తాపత్రయం వల్ల నేరగాళ్లను పార్టీలు పోషిస్తున్నాయి.

- కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి