ఫోకస్

ఏ మతమైనా శాంతినే కోరుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హింసకు ఇస్లాం పూర్తిగా వ్యతిరేకం. అన్ని మతాలూ శాంతి సామరస్యాన్ని కోరుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, దానికి ముస్లింలకు ముడిపెడుతున్నారు. తద్వారా ముస్లింలకు చెడ్డ పేరు వస్తున్నది. ముస్లింలు ప్రతి రోజూ నమాజు చేసేందుకు మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ మత పెద్దలు ఎన్నో హిత బోధలు చేస్తారు. అన్ని మతాలనూ గౌరవించాలని చెబుతారే తప్ప ద్వేషించాలని చెప్పరు. పైగా పెద్దలను గౌరవించాలని, చిన్న వారిని సైతం ఆప్యాయతతో ఉండాలని, వారికి అనురాగం పంచాలని బోధిస్తారు. అన్యమతాల పట్ల ముస్లింలకు ద్వేషభావం లేదు. ‘సమాజంలోని అన్ని మతాలనూ గౌరవించాలి, పరమత సహనం అవసరం..’ అని ముస్లిం మత పెద్దలు హితవు చెబుతారు. అల్లానే సర్వంతర్యామి అని, మహ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు చెబుతారు. అవినీతికి దూరంగా ఉండాలని, పేదలను చేరదీయాలని, మహిళలను గౌరవించాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని వారు సూచిస్తారు.
మంచి నడవడిక, నైతిక విలువలు, పరోపకారం వంటి ఎనె్నన్నో అంశాలు ఇస్లాం బోధిస్తున్నది. అయితే రాజకీయ లబ్దికోసం కొంత మంది ముస్లింలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తీవ్రవాదం, ఉగ్రవాదం మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకూ సవాల్‌గా పరిణమించింది. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాల్సి ఉంది. ఫలానా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది తీవ్రతరం అవుతున్నదని భావించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. దీనిని అరికట్టలేకపోతే కొత్తగా పరిశ్రమలు రావు, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత చెడు మార్గాన్ని పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తీవ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచి వేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయి. ప్రజలు ఎప్పుడైనా శాంతికామకులే. కొంత మంది చేసే దుశ్చర్యల వల్ల మొత్తం సమాజంలో అశాంతి చోటు చేసుకుని అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి ప్రజలు కూడా తీవ్రవాదం, ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అంతేకాకుండా తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అణచి వేసి సమాజంలో శాంతి నెలకొల్పే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది.

- జాహెద్ అలీ ఖాన్ ఎడిటర్, సియాసత్ ఉర్దూ దినపత్రిక