ఫోకస్

నేరాలు-రాజకీయాలు కలిసిపోయాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరాలు, రాజకీయాలు కలిసి పోయాయి, రెండింటిని వేరువేరుగా చూడలేని పరిస్థితికి చేరుకున్నాం. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఇప్పట్లో ఇవి మారుతాయి అనే నమ్మకం కలగడం లేదు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే దానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. దీని కోసం ఎలాంటి అడ్డదారులకైనా తెగిస్తున్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. దీని వల్ల భూముల విలువలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తులు విలువైన ఈ భూములపై కనే్నశారు. ధనబలం, మంద బలం ఉపయోగించి ఎలాగోలా భూములను కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జాల్లో నాయకులు, సంఘ విద్రోహ శక్తులు కలిసిపోతున్నాయి. బలప్రయోగం చేసి భూములు ఆక్రమించుకోవడానికి సంఘ విద్రోహ శక్తులకు రాజకీయ, పోలీసుల అండ అవసరం. వీళ్లు పరస్పరం సహకరించుకుంటున్నారు. తాజాగా నరుూమ్ కేసు ఉదాహరణ.
బీహార్‌లో షాబుద్దీన్ ముగ్గురు నలుగురిని హత్య చేశాడు. జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వస్తే అతనికి స్వాగతం పలికేందుకు 250 కార్లు పోటీ పడ్డాయి. జై లాలూ ప్రసాద్ యాదవ్ అంటున్నారు. బీహార్‌లో నేరస్తులను అన్ని రాజకీయ పక్షాలు ప్రోత్సహించాయి. హత్యలు చేసిన వారు చట్టసభలకు ఎన్నికయ్యే విచిత్రమైన పరిస్థితి. ఒక్క బీహార్‌లోనే కాకుండా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది.
తెలుగునాట కూడా నరుూమ్‌ను ఇదే విధంగా ప్రోత్సహించారు. మావోయిస్టుగా పని చేసిన నరుూమ్‌కు బెదిరింపులు, అక్రమ వసూళ్లు, హత్యలు బాగా అలవాటు. బయటకు వచ్చిన తరువాత మావోయిస్టుగా నేర్చుకున్న దానితో ప్రజలను బెదిరించి, హత్యలు అనేక దారుణాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించారు. నరుూమ్ హత్యలకు లెక్క లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్‌కౌంటర్‌లో హత మార్చడం కన్నా అదుపులోకి తీసుకుని అతనికి సహకరించిన పోలీసులు, రాజకీయ నాయకుల వివరాలు తెలుసుకుంటే బాగుండేది. న్యాయవ్యవస్థ తీరు కూడా అలానే ఉంది. అన్ని వ్యవస్థలు బ్రష్టు పట్టాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఎవరో అవతార పురుషునిలా రావాలి తప్ప లేకపోతే రాజకీయాలు మారుతాయనే నమ్మకం కలగడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కాలం క్రితమే భార్యను త్యజించి రాజకీయాల్లోకి వచ్చారు. వాజ్‌పాయి బ్రహ్మచారి ఇలాంటి వారికి తమ కుటుంబం అంటూ ఉండదు. దేశానికి జీవితాన్ని త్యాగం చేస్తారు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకోవాలి. కానీ పరిస్థితులు మాత్రం నేరస్తులకే రాజకీయాలు అన్నట్టుగా ఉన్నాయి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి