ఫోకస్

నేరస్థులతో నేతల చట్టపట్టాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంకోసం, స్వాతంత్య్రంకోసం సర్వస్వం త్యాగం చేసి రాజకీయ నాయకులను చూసిన దేశంలోనే అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన నేతలనూ చూస్తున్నాం. ఒకపుడు ఉన్నదంతా పంచేసి, పూరిళ్లలో చరమాంకాన్ని గడిపిన నేతలు ఎందరో ఉండగా, కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు స్వర్గ్ధామాలను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న నేతలు రాత్రికి రాత్రి అంత ధనవంతులు ఎలా అవుతున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే.
హిందూ కోడ్ బిల్లును ఆమోదించడంలో ఆలస్యం అవుతోందని, దీనివల్ల దేశ ప్రజలకు నష్టం వాటిల్లుతోందని, ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని డాక్టర్ అంబేద్కర్ 1951లో తన పదవికి రాజీనామా చేశారు, 1956లో రైలు ప్రమాదానికి బాధ్యత వహించి లాల్‌బహుదూర్ శాస్ర్తీ రాజీనామా చేశారు. అటువంటి విలువలున్న నేతలు నేడు రాజకీయాల్లో బూతద్దం పెట్టి వెతికినా కనపడని పరిస్థితి.
నేరస్థులతో రాజకీయ నాయకుల సంబంధాలు ఇపుడు కొత్తేమీ కాదు, ఇదే చివరిదీ కాదు. అంతర్జాతీయ స్థాయిలో నేరస్థులతో రాజకీయ నాయకుల సంబంధాలపై ఎన్నో ఘట్టాలున్నాయి. భారతీయ రాజకీయ చరిత్రలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నేరస్థులతో రాజకీయ నాయకుల సంబంధాలపై లెక్కలేనన్ని సంఘటనలు ఉన్నాయి. ఇంగ్లాండ్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఆరోపణలు వచ్చిన మరుక్షణం నేతలు తప్పుకోకతప్పదు, కాని మన దేశంలో నేతలు బుకాయించినంతగా ఎవరికీ సాధ్యం కాదేమో. ఇండోనేషియాలో తెచ్చిన అప్పు తిన్న నేరానికి ఆ దేశ ప్రధాని జైలుశిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. కాని భారత్‌లో రాజకీయ నాయకులకు నేరస్థులకు ఉన్న సంబంధాలు బహిర్గతమే. నేరస్థుల చిట్టా అంత చిన్నదేమీ కాదు, తాజాగా నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత వచ్చిన వార్తలు వింటుంటే రాజకీయ నాయకులకు, అధికారులకు నేరస్థులతో ఉన్న సంబంధాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
గ్యాంగ్‌స్టర్ నరుూం ఎవరో తమకు తెలియదని, ఆయన ఎలా ఉంటాడో కూడా ఫోటోలు చూశాకే తెలుసుకున్నామని చెప్పిన నేతల జాతకాలు బయటపడగానే నేడు బావురుమంటున్నారు. నరుూం డైరీని స్వాధీనం చేసుకున్న పొలీసులు డైరీలో ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సహా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలకూ నరుూంతో లింకులున్నాయని గుర్తించారు. తొలుత టిడిపికి చెందిన ఒక మాజీ మంత్రి పేరు వినిపించింది. తనకే పాపం తెలియదని మీడియా ముందుకు వచ్చి ఆమె వివరణ ఇచ్చారు. తనను కావాలనే అధికార పార్టీ టార్గెట్ చేస్తోందని ఆమె విమర్శించారు కూడా. నరుూం హతమైన పది రోజులకే ఎవ్వరూ ఏమీ అడగకుండానే మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నరుూం తననూ బెదిరించాడని కన్నీటి పర్యంతమయ్యారు. టిఆర్‌ఎస్ మంత్రి జగదీష్‌రెడ్డి నరుూంతో చట్ట్టపట్టాలేసుకుని దందాలు చేశాడని విమర్శలు గుప్పించాడు. ఇక తాజాగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మీడియా ముందుకు వచ్చి, నరుూం తనకు రాడికల్ ఉద్యమ సమయంలో మాత్రమే తెలుసని చెప్పారు. బహిరంగంగా బయటకు రాని నేతలు ఎందరో ఉన్నారు. నరుూం డైరీనే కాకుండా పోలీసులు వారికి అనుమానం వచ్చిన ప్రతి నేతపైనా నిఘా పెంచారని, వారి ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ క్రమంలోనే కొంత మంది నేతల పేర్లు బయటకు వచ్చాయని సమాచారం. ఈ జాబితాలో అన్ని పార్టీల నేతలూ ఉన్నారనేది నిర్వివాదాంశం.
రాజకీయ నాయకులతో నేరస్థుల సంబంధంఒక వటవృక్షంగా తయారైంది. అతి తేలికగా ఇరు వర్గాల మధ్య సంబంధాలు పెరిగి పెద్దవవుతూ వెర్రితలలువేయడం మొదలుపెట్టాయి. త్వరగా డబ్బు సంపాదించడం, వైరి వర్గాలను దారిలోకి తెచ్చుకోవడం, అడ్డొచ్చిన వారిని తొలగించుకోవడం వంటి అనేక పనులను తేలికగా చేసుకోవడంతో నేరస్థులతో సంబంధాలు మరింతగా పెనవేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిందేనని యువత కోరుతోంది. ఈ ప్రక్షాళన ఎక్కడి నుండి ప్రారంభించాలో ఈ వారం నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.