ఫోకస్

కయ్యంవల్ల ప్రయోజనం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ అంశం చాలా సున్నితమైంది. ప్రస్తుత పరిస్థితులలో కయ్యానికి కాలు దువ్వితే ప్రయోజనం లేదు. యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయి. ఎంతిట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం లభించినా, లభించకపోయినా ఉద్రిక్తత పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కవచ్చు. జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరిపై మొదట అక్కడి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలను మానసికంగా పాకిస్తాన్ పట్ల ఏ విధమైన వైఖరితో అనసరించాలో ప్రజల సంసిద్ధం చేయాలి. ప్రజలను చైతన్య పర్చకుండా సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే జమ్ము కాశ్మీర్‌లో స్థానికంగా ఉండేవారిలో భిన్నాభిప్రాయాలు కలిగిన వారు ఉండవచ్చు. వారిని మొదట భారతదేశం వైఖరినికి అనుగుణంగా మలుచుకోవాలి. అలాకాకుండా ప్రజలను వదిలేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంవల్ల ప్రయోజనం లేదు. జమ్ములో పాకిస్తాన్ అనుకూల వైఖరిని అవలంభించే వారిని మార్చుకోకుండా ఏం చేయలేం, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న చందంగా పరిస్థితి మారిపోతుంది. తీవ్రవాదులకు అశ్రయం కల్పించే పరిస్థితి అక్కడ ఎంతమాత్రం ఉండకూడదు. అలా జరిగితే మన సైన్యం గుట్టురట్టులన్నీ వారికి ఇక్కడివారే చేరవేసే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అందుకే ముందు స్థానికంగా ఉండే ప్రజలను దేశానికి అనుకూలంగా మలుచుకోవాలి. లేనిపక్షంలో శత్రువుకు మన వారి నుంచే ఉప్పు అందే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులలో యుద్దం చేయడం వల్ల వారికే కాదు మనం కూడా చాలా నష్టపోతాం. ముఖ్యంగా ఇందులో సామాన్య ప్రజలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. పాకిస్తాన్ వ్యవహరశైలిని ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అగ్రదేశాలకు తెలియజేయాలి. ప్రపంచం ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టాలి. ప్రజలను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సన్నద్ధం చేయాలి. చివరగా పాకిస్తాన్‌తో సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలి. అప్పటికీ దారికి రాకపోతే అప్పుడు యుద్ధానికి దిగాలి.

- ప్రొఫెసర్ రాజ్ సిద్ధార్థ కాకతీయ విశ్వవిద్యాలయం