ఫోకస్

పాక్‌ను ఏకాకి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌ను అన్ని మార్గాల నుంచి ఏకాకిగా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. 1971 సంవత్సరంలో కూడా ఏకాకి చేయడం జరిగింది. యుద్ధం చివరి అంశం అవుతుంది. పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి. నిధులు, అప్పులు పుట్టకుండా చేయాలి. సార్క్ దేశాలు కూడా పాక్‌ను ఏకాకి చేయాలి. చైనాకూడా మన దేశం వైపు మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే చైనా ఉత్పత్తులు మన దేశంలో ఎక్కువగా విక్రయం అవుతున్నాయి. ఇరాక్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వవు. యుద్ధం రావాలని కోరుకోవడం లేదు. అనివార్యమైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయాలని బిజెపి కార్యకర్తలే కాదు మెజారిటీ ప్రజలూ ఆశిస్తున్నారు. ఉరీ సంఘటన పునరావృతం కారాదు. పాక్ తన స్థితిని అర్థం చేసుకుని నడుచుకుంటే మంచిది. ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ యుద్ధం కావాలని కోరుకోవడం లేదని, అయితే అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు, అంతర్జాతీయ సమాజం యుద్ధం కోరుకోవడం లేదు. కాబట్టి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని ప్రపంచ దేశాలన్నీ పాక్‌పై వత్తిడి పెంచే అవకాశం ఉంది.

- డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి