ఫోకస్

యుద్ధం పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ సమస్య రాజకీయాలతో ముడిపడి ఉంది. ఈ సమస్య యుద్ధంతో పరిష్కారం కాదు. కశ్మీర్ అల్లకల్లోలంతో దేశ పౌరుల్లో దేశభక్తి పెరిగింది. దేశ విభజన సమయంలో నాటి పాలకుల రాజకీయాలతో కశ్మీర్ సమస్య మరింత జటిలం చేశారు. ఇటీవల ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడి అమానుషం. ఈ సంఘటన యావద్భారతదేశాన్ని కలచివేసింది. ఈ అఘాయిత్యానికి పరిష్కారం చర్చలతో సరిపోదు. దీనికి పలు దేశాల మద్దతు కావాలి. ఐక్యరాజ్య సమితి స్పందించాలి. ఉరీ సంఘటన దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, దేశభక్తి మరింత పెంపొందించింది. అయితే చాలామంది ఈ సమస్యకు పరిష్కారం యుద్ధమే అంటున్నారు. కానీ యుద్ధం తరువాత ఏముంటుంది. ఏమీ ఉండదు. యుద్ధం చిన్న సమస్య కాదు.. ప్రపంచ సమస్యగా పరిణమించొచ్చు. యుద్ధంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురికావడం, దేశం ఆర్థిక సమస్యలో చిక్కుకోవడం వంటి పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం రగులుతోంది. దేశప్రజలు స్పందిస్తున్నారు. వీలైనంత త్వరగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం జరగాలి. దీనికి అన్ని వర్గాలు, అన్ని దేశాలు స్పందించాలి. ఆ దిశగా కొంతమేరకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. కానీ ఈ సమస్యకు యుద్ధమే పరిష్కారం కాదు. భారత్ పాక్‌తో యుద్ధాన్ని కోరుకోదు. పిఓకే సమస్య నిన్న, ఇవాళ్టిది కాదు.. ఏళ్ల తరబడి అక్కడ ఉరీలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కశ్మీర్‌పై పాక్ దాడులు, ఉగ్రవాదుల కాల్పులు కొత్తవేమి కాదు. పాకిస్తాన్, భారత్‌పై ఉద్దేశ్యపూర్వకంగా కాల్పులు జరిపినా.. అది ఉగ్రవాదుల చర్యగానే పరిగణించబడుతోంది. దీనిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు బాహటంగానే ఈ దాడులు తమవేనని ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికి దిగబోదనే అనుకుంటున్నాం. కశ్మీర్ సమస్య యుద్ధంతో పరిష్కరించబడుతుందని అనుకోవడం లేదు. ఈ దిశగానే ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా పావులు కదుపుతారనే భావిస్తున్నాం.

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు