ఫోకస్

చర్చలే సమస్యకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులతో చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. పాకిస్తాన్‌తో యుద్ధం సమంజసం కాదు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అణుయుద్ధానికి పాకిస్తాన్ పాల్పడితే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. యుద్ధంలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. యుద్ధం వల్ల ఇరు దేశాల సామాన్య ప్రజలు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే యుద్ధాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి అక్కడి ప్రజల్లో మూడురకాల మనస్తత్వాలు ఉన్నవారు నివసిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపివేయాలని కోరేవారు ఒకరకమైతే, స్వతంత్రదేశంగా ప్రకటించాలని కోరేవారు మరికొంత మంది ఉన్నారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగానే కొనసాగించాలనే వారు ఇంకోరకంగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ ఏర్పడ్డప్పటి నుండి ఇదొక సమస్యగానే కొనసాగుతూ వస్తోంది. స్వతంత్రదేశంగా కొనసాగాలని కోరేవారు, పాకిస్తాన్‌తో కలిసిపోవాలనే వారు ఏకమవుతుండటంతో సమస్య జఠిలం అవుతోంది. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని, ఏవైనా స్థానిక సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు సరిగ్గా జరగడం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కానీ, నేడు బిజెపి ప్రభుత్వం కానీ ఈ దిశలో ముందడుగు వేయడం లేదు. జమ్మూకాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెంచిపోషిస్తోంది. పాకిస్తాన్‌లో అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో సామాజిక, ఆర్థిక, పరిపాలనా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. పాకిస్తాన్‌లో సమస్యలను పరిష్కరించలేని అక్కడి ప్రభుత్వం ఎప్పుడూ భారత్‌నే అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. తీవ్రవాదులను భారత్‌లోకి వెళ్లేలా చూస్తూ, మరీముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో అలజడి, అశాంతి సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలి. అంతర్జాతీయ వేదికల్లో, ఐక్య రాజ్యసమితిలో పాకిస్తాన్ ఎత్తుగడలు, తీవ్రవాదానికి ఏ విధంగా మద్ధతు ఇస్తూ, భారత్‌లో అలజడి సృష్టించేందుకు కుటిలయత్నాలు చేస్తుందో బహిర్గతం చేయాలి. తీవ్రవాదులతో, పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరపడంలో తప్పు లేదు. అంటే భారత్ శాంతియుతంగా ఏ విధంగా ముందుకు వెళుతుందో ప్రపంచానికి వెల్లడించాల్సిన అవసరం ఉంది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంటేనే అభివృద్ధి, శాంతి వెల్లివిరుస్తాయని ఆ రాష్ట్ర ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం కలిసి ముందడుగు వేయాలి.

- కె. రామకృష్ణ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి