ఫోకస్

వనరులపై దెబ్బకొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను గట్టిబుద్ధి చెప్పాల్సిందే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. భారత్ సహనాన్ని తక్కువగా అంచనా వేస్తే పాక్ పప్పులో కాలేసినట్లే. కాని భారత్ యుద్ధాన్ని చివరి ఆఫ్షన్‌గా ఎంచుకోవాలి. పాత రోజుల్లో మాదిరిగా ప్రస్తుతం యుద్ధం చేయడం అంత సులువు కాదు. యుద్ధాన్ని ప్రారంభించడం మన చేతిలో పని. ముగింపు మన చేతిలో ఉండదని విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడికి హితవచనం పలికారు. అలాగే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గత 69 సంవత్సరాలుగా కాశ్మీర్ విషయంలో పాక్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా పాక్‌కు ఆర్థిక వనరులు కట్ చేయాలి. నదీ జలాల విషయంలో కూడా కఠిన వైఖరిని అవలంభించాలి. పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ స్టేటస్ అనే హోదాను 1996లో ఇచ్చాం. దీనిని రద్దు చేస్తే మంచిదే. సరిహద్దుల వద్ద నిఘా పెంచాలి. నిఘా విభాగానికి ఆధునిక పరికరాలు ఇవ్వాలి. సైన్యాన్ని ఆధునీకరించాలి. ఉగ్రవాదులు చొరబడే ప్రాంతాల వద్ద సైన్యాన్ని మోహరించాలి. పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయాలి. పాక్ తయారీ వస్తువులను దేశంలో అనుమతించరాదు. పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే దేశాల్లో తయారయ్యే ఉత్పత్తులను వాడరాదు. పాకిస్తాన్‌లో ప్రజలు వాళ్ల సైన్యం చేస్తున్న దురాగతాలు, ప్రభుత్వ దమనకాండ, ఉగ్రవాద మూకల అరాచకాలపై ఏహ్యభావం కలిగించే విధంగా భారత్ అంతర్జాతీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పాకిస్తాన్‌తో 1947, 1965, 1971లో మూడుసార్లు యుద్ధం జరిగింది. వాజపేయి హయాంలో కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేయడం మంచిదే. కాని ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుంది. పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైతే ఎన్ని రోజులైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పఠాన్‌కోట, ముంబాయి దాడులనుంచి పాఠాలు నేర్చుకున్నామా? తాజాగా ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల హత్యాకాండకు కారణం ఏమిటి? ఆవేశంలో హడావిడి నిర్ణయం తీసుకోకూడదు. పాకిస్తాన్ ఆర్థికంగా చతికిలపడే విధంగా దారిలోకి తెచ్చుకోవాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత