ఫోకస్

వీడియోలు బయటపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, కాశ్మీరీర్‌లోని ఉరీ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దేశానికి చెందిన ముష్కరులు దాడి చేశారని, దానికి ప్రతీకార చర్యగా మన దేశ సైన్యం పివోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించారు. కానీ ఆ వీడియో క్లిప్పింగ్‌లేవీ? దాడి జరగలేదని పాకిస్తాన్ ప్రకటించింది. మరోవైపు యుఎన్‌వో కూడా అటువంటి ఆనవాళ్ళు ఏవీ లేవని స్పష్టం చేసింది. నిజంగా దాడి జరిగితే కేంద్రం వీడియో క్లిప్పింగ్‌లను బయటపెట్టాలి. లక్షిత దాడిలో ఎంతమంది మరణించారో ఆధారాలతో స్పష్టం చేయాలి. ఇంత సున్నితమైన అంశంపై రాజకీయ కోణంలో ఆలోచన చేయడం తప్పు. పఠాన్‌కోట్, ఉరీపై దాడి చేసింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులా లేక పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులా అనేది స్పష్టం కావాలి. ఒకవేళ ఉగ్రవాదులైతే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులైతే తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిందే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సాన్నిహిత్యం కొనసాగించిన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలద్వారా సమస్య పరిష్కారానికి ఎందుకు కృషి చేయడం లేదు? అసలు నవాజ్ షరీఫ్‌ను మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదు. ఇటువంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు యుద్ధాలు ప్రజలు నిర్ణయిస్తే జరగకూడదు. ప్రజలను సంతృప్తి పరిచేందుకు యుద్ధాలు చేయకూడదు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉంది. కానీ మాస్ హిస్టిరియాలా యుద్ధం చేయాల్సిందేనని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కానీ యుద్ధం జరిగితే రెండు దేశాలూ నష్టపోతాయి. కాబట్టి సున్నితమైన అంశంపై చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడమే ఉత్తమమైన మార్గం.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు, ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి