ఫోకస్

గుర్తింపులేని వర్శిటీల్లో చేరొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న తెలుగు విద్యార్థులను ఆ దేశానికి రానీయకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటున్నారు. కొద్దికాలం వరకూ మనదేశం నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలోనే యువకులు అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇటీవల అమెరికాలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాల నుంచి అమెరికాకు వస్తున్న యువతను ఇమిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అమెరికా చట్టాలు, నిబంధనల పట్ల భారతదేశ ప్రజలతోపాటు, వివిధ దేశాల వారికి పెద్దగా అవగాహన లేకపోవడం పొరపాటు. గుర్తింపులేని యూనివర్శిటీల గురించి ప్రచారం చేయాలని, అలాగే అమెరికా చట్టాల గురించి వివరించాలని నిర్ణయించింది. ఇది మంచి పరిణామమే. అమెరికాలో ఉన్న మన విద్యార్థులకు ప్రస్తుతం ఇబ్బంది లేదు. కొత్తగా వెళ్లే వారైనా అమెరికా చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనవాళ్లు అమెరికా వెళ్లడానికి ఇప్పుడున్న ఆంక్షలను కాస్త సడలించేందుకు భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.

-కంభంపాటి హరిబాబు ఎంపి, విశాఖపట్నం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు