ఫోకస్

సరిహద్దుల్లో సెగలు.. పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తత ప్రపంచానికే తలనొప్పిగా తయారైంది. వాస్తవానికి ఇది రెండు దేశాల అంతర్గత సమస్య అయినా పాకిస్తాన్ చాలాకాలంగా దీనినో అంతర్జాతీయ అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. భారత్ మాత్రం ఎన్ని యుద్ధాలు జరిగినా, సంయమనాన్ని కోల్పోకుండా, వీలైనంత శాంతిని పాటిస్తూ, చర్చలకు ఎపుడూ స్వాగతిస్తూనే ఉంది. చర్చల్లో పాల్గొంటున్నట్టే పాల్గొని పాకిస్తాన్ ప్రతిసారీ మొదటికి వస్తోంది. అంతేకాదు, ఆయుధ సామగ్రిని, ఛాందసవాదాన్ని కలగలిపి ఉగ్రవాదులకు బాసటగా నిలుస్తూ, ఎప్పటికపుడు భారత్‌కు సవాలు విసురుతూనే ఉంది. యుద్ధానికి దిగితే ఓటమిద్వారా పాక్‌కు పోయే పరువు కొత్తగా ఏమీ లేదు, ఏతావాతా భారత్‌కు మాత్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది ఎదురుకాక తప్పదు, వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే, చైనా మద్దతు చూసుకుని పాకిస్తాన్ భారత్‌కు తగిన శాస్తి చెప్పవచ్చనే భ్రమల్లో ఉందనేది వాస్తవం. అమెరికా, రష్యా వంటి ఆసియా అనుకూల దేశాలు ఎన్ని హెచ్చరికలు చేసినా ‘కుక్కతోక వంకర’ అన్న చందంగా పాకిస్తాన్ తన పని తాను చేసుకుంటూ పోవడమేగాక, సమయం దొరికినపుడల్లా ఉగ్రవాద తోడేళ్లను భారత్‌పైకి ఉసిగొలిపేందుకు, కంచెదాటించే విషయంలో సహకరించేందుకు ఎన్నడూ వెరవలేదు. పాకిస్తాన్‌తో తొలి యుద్ధం మొదలు నేటివరకూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది తొలుత పాకిస్తానే అనే విషయం చరిత్ర చెప్పకనే చెబుతోంది. భారత్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడమేగాక, దానిని అంతర్జాతీయ అంశంగా చిత్రీకరించి చర్చకు పెడుతున్న పాక్ పన్నాగాలను, కుట్రలను ఎప్పటికపుడు చాణక్యనీతితో భారత్ తిప్పికొడుతూనే ఉంది. అయినా బుద్ధి తెచ్చుకోని పాక్ ఇటీవల ఉరీ ఘనతో భారత్‌ను రెచ్చగొట్టింది, భారత్ దానికి తగిన శాస్తి చెబుతూ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా ఒకపక్క సాయుధ బలగాల సత్తాను చూపడం మరోపక్క ఉగ్రవాదులను మట్టుబెట్టడం అనే రెండు కార్యక్రమాలను సజావుగా నిర్వహించి పాక్‌ను దిగ్భ్రమకు గురిచేసింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా గత వారంలో ఐదుమార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి సైనిక దాడులకు దిగిన పాక్‌పై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. పాక్ సైనికాధికారులు సరిహద్దును సందర్శించారు, సైనికులకు భారత్ వ్యతిరేక పాఠాలను నూరిపోస్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సన్నద్ధమవుతోంది. మొత్తం మీద సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎపుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం జమ్ము కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. ఈ ఉద్రిక్తత ఎంతకాలం? తాడో పేడో తేల్చుకునేందుకు యుద్ధం చేయడమే తుది పరిష్కారం అని చెప్పేవారూ లేకపోలేదు, అణ్వాయుధాలు పాకిస్తాన్ వద్దనే ఎక్కువగా ఉన్నా ప్రపంచం అంతా ఏకాకి చేసిన పాకిస్తాన్‌కే ఎక్కువ ముప్పు అనేది ‘వార్’ నిపుణుల అభిప్రాయం. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.