ఫోకస్

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా మారింది. పార్టీలో సీనియర్ నాయకులకు చెక్ పెట్టడం ఒక ప్రయోజనం అయితే యువత కొత్తతరంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించడం మరొక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే యువరక్తానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్భ్రావృద్ధికి దోహదపడుతుంది. కేవలం 10 జిల్లాలతో కూడిన రాష్ట్రం తెలంగాణ అంటే బయటివారికి చిన్నచూపుగా ఉండేది. ఇప్పుడు 31 జిల్లాలతో కూడిన రాష్ట్రం అంటే ఈ రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని దేశ, విదేశాల్లో ఉన్నవారికి కూడా అనిపిస్తుంది. 31 జిల్లాలు ఏర్పడటం రాష్ట్రానికి దేశ విదేశాల్లో విలువ పెంచినట్టయింది. చిన్న జిల్లాల ఏర్పాటువల్ల పరిపాలనా సౌలభ్యం కూడా కలుగుతుంది. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా, తహసీళ్ల స్థానంలో మండలాలను ఏర్పాటు చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. కాని కాలక్రమంలో మండల వ్యవస్థ మంచిదేనని తేలింది. తహశీల్దారులు ఉన్న సమయంలో ఒక్కొక్క తహశీల్ పరిధిలో 100 వరకు గ్రామాలుండేవి. విద్యార్థులకు కులం, ఆదాయం తదితర సర్ట్ఫికెట్లు కావాలన్నా, రైతులు భూములకు సంబంధించిన లావాదేవీలు పూర్తి చేసుకోవాలన్నా నెలల తరబడి సమయం పట్టేది. మండల వ్యవస్థ వచ్చాక ఎంఆర్‌ఓ ఆఫీసుకు అలా వెళ్లగానే ఇలా పని అయిపోతోంది. అదే విధంగా గతంలో ఒక్కో జిల్లాలో 60 వరకు మండలాలు ఉండటం వల్ల కలెక్టర్‌తోసహా జిల్లా అధికారులకు పనిభారం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 20 నుండి 25 మండలాలకు ఒక జిల్లా ఏర్పడటంవల్ల పనులు వేగంగా జరుగుతాయి. ప్రజలకు కూడా జిల్లా కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్టయింది. ప్రజల ముంగిట్లో పాలన అంటే ఇదేనని చెప్పుకోవచ్చు. చిన్న జిల్లాలు కావడంవల్ల యువ అధికారులు నియామకం అవుతారు. పనులు వేగంగా, చురుగ్గా జరుగుతాయి. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామాల్లో, కొత్త జిల్లా కేంద్రాల్లో, కొత్త రెవెన్యూ డివిజన్లలో, కొత్తగా ఏర్పడ్డ మండల కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. పరిపాలన ప్రజల ముంగిట్లోకి వచ్చినట్టయింది. ఇవి కాదనలేని వాస్తవాలు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీరకణతో ఫలితాలు ఎలా ఉంటాయో కాలమే చెబుతుంది. ఈ నిర్ణయంవల్ల కెసిఆర్‌కు రాజకీయంగా మరో ఐదేళ్లపాటు ఆయుష్షు పెరిగినట్టయింది.

- కె. నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి