ఫోకస్

మార్గదర్శకత్వం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చెల్లుబాటు అయ్యే వీసాలను చూపించినా అమెరికా ఇమిగ్రెంట్ అధికారులు ఇటీవల ఆ దేశం నుంచి విద్యార్థులను పంపించివేశారు. అమెరికా అధికారులు ఈ విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోలేకపోయారు. అమెరికా వ్యవహారశైలిని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించాల్సిన పరిణామమిది. అలాగే ఈ సంఘటన మన దేశంలో ఉన్నత విద్య వ్యవస్థలో చోటుచేసుకున్న తీరును సూచిస్తోంది. ఐఐటిలను మన దేశంలో 50 సంవత్సరాల క్రిందట నెలకొల్పారు. కాని పోటీకి తగ్గట్టుగా వర్శిటీలు లేవు. ప్రతిభావంతులు ఎక్కువ. వర్శిటీలు తక్కువ. అందుకే మన విద్యార్థులు అమెరికావైపు చూస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అప్పులు చేసి అమెరికాకు వెళ్లి చదువుతున్నారు. కాని మోసం చేసే కనె్సల్టెన్సీల చేతుల్లో విద్యార్థులు దారుణంగా వంచనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థను సంస్కరించాలి. ఎఐసిటిఇలో మార్పులు తేవాలి. తామరతంపగా వెలుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై వేటువేయాలి. బిటెక్ చదివే విద్యార్థులు అమీర్‌పేటలో బిటెక్ ప్రాజెక్టులకు అటెండవుతున్నారు. మన దేశంలో ఎంటెక్, పిహెచ్‌డి కోర్సులను ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశపెట్టాలి. ఉన్నత ప్రమాణాలను పాటించాలి. మన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన వర్శిటీల్లో చదివే విధంగా కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దీనికి తగినట్లుగా గైడెలైన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. మోసం చేసే కనె్సల్టెన్సీలపై వేటు వేయాలి. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థుల ప్రయోజనాలను పరరిక్షించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

- పాండురంగారావు అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా