ఫోకస్

అపోహలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా వస్తువులను భారతీయులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నందు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు, రక్షణకు ఏదో నష్టం జరుగుతోందంటూ సోషియల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారానికి సంఘ్‌పరివార్ కారణంగా భావించవచ్చు. చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయడంవల్ల భారత్ నుండి దండిగా డబ్బులు చైనాకు వెళుతున్నాయని, అదే డబ్బును ఆయుధాలపై చైనా పెట్టుబడి పెట్టి పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. భారత్‌పై తీవ్రవాదుల దాడులు, దాడుల వెనుక పాక్ ప్రభుత్వ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. అందువల్ల చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయవద్దంటూ సోషియల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం కొనసాగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లి అనేక ఒప్పందాలను కుదుర్చుకుని వచ్చారు. వివిధ వస్తువులు, ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేశాయి. బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయడంలో భారత్-చైనా కీలకమైన దేశాలుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన జిఎస్‌టి బిల్లు కూడా విదేశాల నుండి ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం చూపుతుంది. డబ్ల్యుటిఓ ఒప్పందం ఫలితంగా వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతులకు కొంత ఆటంకం ఉండేది. తాజాగా అమెరికా చేసిన ప్రకటన భారత్‌పై ఆంక్షలను ఎత్తివేసింది. పాకిస్తాన్‌తో అనేక దశాబ్దాల నుండి మిత్రదేశంగా అమెరికా ఉంటూ వస్తోంది. పాకిస్తాన్‌కు మొదటి నుండి ఆయుధాలతోపాటు సైనికంగా కూడా సాయం చేస్తున్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్‌ఎ). అమెరికా పాక్‌కు మిత్రదేశంగా ఉండగా, రష్యాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అంటే భారత్‌కు శత్రుదేశాల్లో పాక్‌తోపాటు అమెరికా కూడా ఉండేవి. భారత్‌లో దేశభక్తులుగా భావిస్తున్నవారు ఈ వాస్తవాన్ని గుర్తించాలి. వాస్తవంగా భారత్ అలీనదేశంగా ఉంటూ వచ్చింది. అలీన దేశంగానే భారత్‌కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు అమెరికాతో మన దేశం ఎక్కువ స్నేహంగా ఉంటోంది. భారత్ అమెరికాకు ఊడిగం చేస్తోందనిపిస్తోంది. మారిన పరిస్థితిలో పాకిస్తాన్‌కు రష్యా ఆయుధాలు సరఫరా అవుతుండటమే కాకుండా, సైనిక విన్యాసాలు కూడా రష్యా చేస్తోంది. అంటే భారత విదేశాంగ విధానం మారడటంతో అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. విదేశాల నుండి భారత్ ఒక్కటే దిగుమతులు చేసుకోవడం లేదు.. అమెరికా కూడా విదేశాల నుండి అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిలో చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దంటూ ప్రచారం జరగడంలో అర్థం లేదు.

- బి.వి. రాఘవులు సిపిఐ జాతీయ నాయకులు