ఫోకస్

సాధ్యమయ్యే పనేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచార టెక్నాలజీ విప్లవంతో ప్రపంచమే కుగ్రామమైన తరుణంలో, పోటీతత్వం విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ఒక దేశ ఉత్పత్తులను నిషేధించాలనుకోవడం సాధ్యమవుతుందా లేదా అనేది అనుమానమే. కాని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆ దేశ ఉగ్రవాద తండాలు పాల్పడుతున్న అరాచకాలను తిప్పిగొట్టాలని ప్రతి భారతీయుడు తహతహలాడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్‌కు చైనా మిత్ర దేశం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మన దేశంలో చైనా నుంచి దిగుమతి చేసే వస్తువులను వాడరాదని, ఉత్పత్తులను నిషేధించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. చైనాతోకూడా మనకు సరిహద్దుపరంగా కొన్ని వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డ్రాగాన్ అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్హట్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతంద్వారా అరేబియా సముద్రానికి చేరువకావాలని చైనా ఒక కారిడార్‌ను నిర్మిస్తోంది. భారత్-చైనా మధ్య ఉగ్రవాదం బెడదలేదు. సరిహద్దు వివాదాలున్నా వాటిని మాట్లాడి పరిష్కరించుకునే స్ధాయిలో ఉన్నాయి. పాకిస్తాన్‌ను ఏకాకి చేయాలన్న భారత్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాద్యమాల్లో చైనా ఉత్పత్తులను కొనరాదంటున్నారు. చైనాకంటే పెద్ద శత్రువు అమెరికా. అమెరికానే ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. తాలిబాన్లకు ఆయుధాలు ఇచ్చిందెవరు? ఆప్గనిస్తాన్‌లో అల్లకల్లోలానికి కారణమేంటి? పశ్చిమాసియాలో ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య చిచ్చు ఆరకుండా ఉండేందుకు కారణమెవరు? ఈ విషయాలు అందరికీ తెలిసినవే. భారతదేశం దేశీయంగా ఉత్పత్తులను పెంచాలి. లాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ప్రోత్సాహం ఇవ్వాలి. వాటి ధరలను తగ్గించాలి. అప్పుడు మన దేశ ప్రజలు చైనా వస్తువుల పట్ల ఆకర్షితులు కావడం మానివేస్తారు. చైనానుంచి వచ్చే వస్తువులను స్వీయ నియంత్రణతో కొనడం మానేయాలనుకుంటే మానేయవచ్చు. పూర్తిగా నిషేధం విధిస్తే అక్రమ రవాణాద్వారా దేశంలోకి వస్తాయి. భారతదేశం గంపగుత్తుగా చైనా వస్తువుల దిగుమతిపై నిషేధించలేమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాని యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించవచ్చు. వాస్తవానికి 2014-15 మధ్య ఇరుదేశాల మధ్య వాణిజ్యం 72 బిలియన్ డాలర్లు ఉంటే, 2015-16కు 70.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఒక ప్రత్యేక దేశంతో దిగుమతులను వద్దంటూ తీసుకునే చర్యలు ఉండవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాణ్యతలేని, తక్కువ ధరకే వచ్చే వస్తువులు మన మార్కెట్‌పై దండెత్తి వస్తుంటే వినియోగదారుల రక్షణకు మార్గదర్శకాలను కేంద్రం అమలు చేయాల్సి ఉంటుంది. బ్రిక్స్ దేశాల సదస్సు గోవాలో జరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాలపై సాదరంగా మాట్లాడారు. ఇది వాస్తవమైతే, చైనానుంచి వస్తువులను నిషేధించాలన్న వారి కోరిక నెరవేరుతుందా? కొన్ని అంశాలు సామాజిక మాద్యమాల్లో ప్రచారానికి, చదువుకోవడానికి బాగుంటాయి. పాకిస్తాన్ పీచమణిచి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి. ఈ విషయంలో 120 కోట్ల మంది భారతీయులది ఒకటే గొంతు. మరో అభిప్రాయానికి తావులేదు.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత