ఫోకస్

నిషేధం అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తు ఉత్పత్తిపై నిషేధం సాధ్యం కాదు
చైనా దేశంలో తయారైన ఉత్పత్తుల దిగుమతి నిషేధం వల్ల, లేదా మన భారతీయులు కొనుగోలు చేయకపోవడం వల్ల ఉగ్రవాదం తగ్గదు. ఒక దేశం దిగుమతులను నిషేధించడానికి అంతర్జాతీయ నిబంధనలు అడ్డు వస్తాయి. మనం ఈ పనిచేశామంటే, చైనా కూడా తన పరపతి ఉపయోగించి భారతదేశం ఎగుమతి చేసే వస్తువులపై నిషేధం విధిస్తుంది. మన వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలపై తన పలుకుబడి ఉపయోగించి అక్కడ కూడా నిషేధం అమలయ్యే విధంగా చూస్తుంది. మనకు, చైనాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి తగాదాలు లేవు. కొన్ని సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల సైనికాధికారులు, ప్రభుత్వ స్ధాయిలో అధికారులు, దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధ. చైనా ఎక్కువ జనాభా కలిగిన దేశం. అందుకే ఈ రెండు దేశాల మధ్య తొలినాళ్లలో అంటే మావో పాలన కొనసాగినంత వరకు 1976 వరకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఆ తర్వాత ప్రపంచీకరణ, ఐటి విప్లవంతో చైనా, భారత్ దగ్గరయ్యాయి. ఈ రోజు ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు నెలకొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు చైనా మద్దతు ఇస్తుందనే కారణంపై చైనా వస్తువులను కొనరాదని, దిగుమతి చేసుకోరాదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. నిజంగా చైనా వస్తువులు కొనకూడదనుకుంటే అది వారి ఇష్టం. ఎవరు బలవంతం చేయరు. ప్రచారం చేసే హక్కు కూడావారికి ఉంటుంది. కాగా పాకిస్తాన్‌కు చైనా వత్తాసుపలుకుతోందనే కారణంపై చైనా వస్తువులను వాడరాదనే అభిప్రాయం సరికాదు. వాస్తవానికి ప్రపంచంలో ఉగ్రవాద మూకలను, శక్తులను ప్రోత్సహిస్తున్న దేశం అమెరికా. ఈ వాస్తవాన్ని మనం మర్చిపోరాదు. 1971 లో ఇండో-పాక్ యుద్ధంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ భారత్‌పై యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. అలాగే పాకిస్తాన్‌ను వేదికగా తీసుకుని ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లను ప్రోత్సహించిన దేశం అమెరికా. ఈ రోజు మధ్య ఆసియా, దక్షిణాసియాలో సంక్షోభాలకు, ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ పోటీకి అమెరికా వైఖరి కారణమని చెప్పవచ్చును. కాని మనం అమెరికాకు వెళ్లకుండా ఉండగలమా ? అమెరికా వస్తువులను నిషేధించే సాహసం చేస్తామా ? మనం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శక్తులను సమూలంగా ఏరిపారేయాలి. ఇందులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడిది ఒకే మాటే. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు బుద్ధి చెప్పాలి. ఈ రోజు చైనా, రేపు నేపాల్, ఎల్లుండి బంగ్లాదేశ్‌తో గొడవలు పెట్టుకుంటే మనం ఏకాకి అవుతాం. పొరపొచ్ఛాలు ఉన్నా, వాటి పరిష్కారానికి దౌత్య నీతిని ఉపయోగించాలి.

-డాక్టర్ రాజ్ సిద్ధార్ధ ప్రొఫెసర్, కాకతీయ వైద్యకళాశాల