ఫోకస్

ప్రభుత్వాలు మారినా.. మారని తలరాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థుల తలరాతలు మారడం లేదు. ప్రభుత్వాలు విద్యను ఒక బాధ్యతగా మానవ వనరుగా చూడటం మర్చిపోయింది. ఎన్నికల హామీలుగా విద్యారంగ పథకాలను ప్రకటించడం మూలంగానే ప్రభుత్వం నేతృత్వంలోని విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయింది. విద్యను పూర్తిగా ప్రభుత్వరంగం నుండి తప్పించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను పాలకులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వౌలిక సదుపాయాలు లేవని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరితే ఫీజు రీయింబర్స్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడం మూలంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. బాధ్యతల నుండి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడానికి డ్రామా ఆడుతోంది. ఈ డ్రామాలో భాగంగానే 10 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్ చేస్తామని, మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయబోమని నిబంధనలు పెట్టారు. 2012-13 సంవత్సరానికి పెండింగ్ రీయింబర్స్‌మెంట్, 2013-14 సంవత్సరానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ మొత్తం 500 కోట్ల రూపాయల వరకు బకాయి ఉందని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా బకాయిపడ్డ ఫీజులు చెల్లించకపోగా, వీరిలో ఎపికి చెందిన విద్యార్థులు ఉన్నారని సాకులు చెబుతున్నారు. 2014-15 నుండి 2015-16 సంవత్సరానికి బకాయిపడ్డ 3100 కోట్ల రూపాయలకుగానూ కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఎపి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేశామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బకాయిలు చెల్లించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ, విద్యారంగాన్నీ నీరుకారుస్తోంది. ఉన్నత విద్యను ఎబిసిడిలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం వల్ల నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయో ప్రభుత్వం ఆలోచించాలి. సరైన సమయంలో ఫీజు రీయింబర్స్ చేయకపోతే విద్యారంగం సమస్యల వలయంలో చిక్కుకుపోతుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యాసంస్థల్లో చేరే సమయంలోనే చెల్లించాలి. దానివల్ల మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు వీలవుతుంది. ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోతే మేము పెద్దఎత్తున వివిధ రూపాల్లో ఆందోళన చేస్తాం.

- ఎం. వేణు ఎఐఎస్‌ఎఫ్, తెలంగాణ అధ్యక్షుడు