ఫోకస్

సిఎం మాటలు.. నీటి మూటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను 2008-09 విద్యా సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినప్పటికీ, దానిని మానవ వనరులపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలని చెప్పేవారు, అది వాస్తవం కూడా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగా వచ్చిన కె. రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో కొంత జాప్యం చేసినా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగానే బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇది వాస్తవంగా ఒక మంచి పథకం. ఫీజులు కట్టలేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులకు చాలా దూరంగా ఉండేవారు. ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల పిల్లలు వృత్తివిద్యను అభ్యసించి వారి జీవితాల్లో స్థిరపడి తమ కుటుంబ సభ్యులను ఆనందంగా గడపడానికి దోహదపడింది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ప్రతి ఏడాదీ విద్యార్థులతోపాటు సీట్ల సంఖ్య పెరగడం, ప్రతి మూడేళ్ళకు ఒకసారి సమీక్షించి ఫీజులు నిర్ణయించే అధికారాన్ని అడ్మిషన్స్ అండ్ ఫీజుల రెగ్యులరేటర్ కమిటీకి సుప్రీంకోర్టు కట్టబెట్టింది. వీటన్నింటి కారణంగా ప్రతి ఏడాది కొంత ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో పెరుగుదల అనేది వచ్చింది. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేయాల్సి వచ్చింది. 2014లో టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత విద్యారంగంగానీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం వంటి విషయాలు ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశంగా కనబడడం లేదు. సకాలంలో అడ్మిషన్ల ప్రక్రియ ముగించాలనిగానీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయాలనిగానీ ఈ ప్రభుత్వానికి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండేళ్ళ బకాయిలు చెల్లించకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య. దీనిద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం దీనిపైన ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది సకాలంలో చేయని కారణంగా దాని దుష్పలితాలు విద్యా ప్రమాణాలపై పడుతున్నాయి. విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నడుస్తున్న కళాశాలలు అనేకం ఉన్నాయి. ఆయా కళాశాలల్లో యజమాన్యాలకు అక్కడ పనిచేసే అధ్యాపకులకు జీతభత్యాలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. అధ్యాపకులపైన యాజమాన్యాలకు నియంత్రణ లోపిస్తున్నది. అధ్యాపకులు కూడా శ్రద్ధతో, చిత్తశుద్ధితో విద్యార్థులకు బోధించడం లేదు. ఏ కళాశాలను ఉదాహరణగా తీసుకున్నా విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చేటువంటి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి. దరఖాస్తులు స్వీకరించి ప్రతి ఏడాది ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయడం వల్ల ప్రభుత్వం పెట్టే ఖర్చుకు ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏప్రిల్ నాటికి బకాయిలన్నీ చెల్లించేస్తామని, వచ్చే ఏడాది నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

- గంగిడి మనోహర్ రెడ్డి కోశాధికారి, తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ