ఫోకస్

ఉమ్మడి పౌరస్మృతి అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం లౌకిక రాజ్యం. ఈ దేశంలో భిన్నమతాలు, విభిన్న కులాలు, జాతులు, అనేక బాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. దేశం లౌకికదేశం కావడం వల్ల భారత రాజ్యాంగమే అన్ని చట్టాలకన్నా ఉన్నతమైంది. లింగవివక్ష లేకుండా, జాతులు, మతాల వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరిగేందుకు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరమే. అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ చట్టం కూడా యూనిఫాం సివిల్ కోడ్‌కు అనుకూలంగానే ఉంది. భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. జాతి, స్థలం, జనన స్థలం, మతం, కులం, లింగవివక్ష లేకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని పార్ట్-3లో పొందుపరిచారు. ప్రతి పౌరుడికి ప్రాథమిక విధులు (డ్యూటీస్) కూడా ఉన్నాయి. ప్రభుత్వం వివిధ చట్టాలకు గైడ్‌లైన్స్ రూపొందించేందుకు డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఉపయోగపడుతున్నాయి. హిందూ సమాజంలో గతంలో బాల్యవివాహాలు ఉండేవి. సతీసహగమనం ఉండేది. సంఘసంస్కర్త రాజారామమోహన్ రాయ్ సతీసహగమనానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకువచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బాల్యవివాహాలను, సతీసహగమనం తదితర దురాచారాలను తొలగిస్తూ, ఎవరైనా వీటికి పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి, శిక్షలు విధించే విధంగా రాజ్యాంగంలో మార్పులు, చేర్పులు తీసుకువచ్చారు. హిందూమహిళలకు వంశపారంపర్య ఆస్తిలో హక్కు ఉండేది కాదు. తర్వాత ఈ హక్కు మహిళలకు ఇస్తూ చట్టసవరణ చేశారు. ఈ తరహా మార్పులు చేర్పులను ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ముస్లిం మహిళలు వైవాహిక అంశాలపై ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక మహిళ భర్త తన భార్యను సంబోధించి మూడు పర్యాయాలు ‘తలాక్’ అంటే ఆమెకు విడాకులు ఇచ్చినట్టేనని ముస్లిం పర్సనల్ లా (షరియత్ లా) చెబుతోంది. అంటే పురుషులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మూడు పర్యాయాలు తలాక్ చెబితే విడాకులు ఇచ్చినట్టే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏకపక్షంగా ఉన్న హక్కే అవుతుంది. ఈనాడు కుక్కపిల్లలను కూడా ఇంత సులువుగా వదలలేని పరిస్థితి నెలకొని ఉంది. అలాంటి పరిస్థితిలో మహిళలకు సమాన హక్కులు లేకపోవడం శోచనీయమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14 ప్రకారం మతం, కులం, జాతి, లింగభేదం, జన్మస్థలం తదితరాల అంశాల్లో అందరికీ సమాన ప్రాధాన్యత, సమాన హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 16 ప్రకారం ఎవరైనా ఏ ఉద్యోగమైనా చేసేందుకు అవకాశం ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం భావస్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, దేశంలో ఎక్కడైనా నివాసం ఉండటం, ఏ వృత్తిపని అయనా చేపట్టేందుకు ప్రతి భారతీయుడు హక్కు కలిగి ఉంటాడు. అందరికీ సమానహక్కులు ఉన్న దేశంలోని మహిళలందరికీ పురుషులతో సమానంగా హక్కులు ఉండాలి. అందరికీ వర్తించేలా యూనిఫాం సివిల్ కోడ్ రావలసిన అవసరం ఉంది.

- ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్