ఫోకస్

మాకు సమ్మతం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామన్ సివిల్ కోడ్ ముస్లింలకు సమ్మతం కాదు. మన చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా లేనప్పుడు ఉమ్మడి పౌరస్మృతి ఉండాలనుకోవడం సమంజసం కాదు. ఇకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘ట్రిపుల్ తలాఖ్’పై చర్చ జరుగుతున్నది. ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ కొంతమంది ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించారు. కానీ వారు ముస్లిం మహిళల్లో ఒక్క శాతం కూడా ఉండరు. నూటికి 99 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను సమ్మతిస్తారు. ఎందుకంటే ట్రిపుల్ తలాఖ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం (1350) నుంచి ఉంది. పైగా హోలి ఖురాన్ ప్రాఫెట్ మహ్మద్ (హదీస్) ఆదేశాల మేరకు ఆచరణలోకి వచ్చింది. నలుగురు ఇమాంలు కలిసి రూపొందించారు. 1) ఇమామే ఆజం అబు అనీషా, 2) ఇమామేషాఘై, 3) ఇమామే అహ్మద్ అంబల్, 4) ఇమామే మాలిక్. దీనిని ‘్ఫఖా’ (ఇస్లామిక్ చట్టం)లోకి తీసుకుని వచ్చారు. ఆడవాళ్ళకు అన్యాయం చేయరాదని, వారిపట్ల దయాగుణం కలిగి ఉండాలని ప్రాఫెట్ మహ్మద్ చెప్పారు. అలా ఉన్నవారే ‘జన్నత్’ (స్వర్గం)లోకి వెళతారని కూడా చెప్పారు. కాబట్టి ఎవరూ తొందరపడి ‘ట్రిపుల్ తలాఖ్’ చెప్పరు. చాలామందికి ట్రిపుల్ తలాఖ్‌పై దురభిప్రాయం ఉంది. ఎవరో పురుషుడు మూడు పర్యాయాలు (ట్రిపుల్ తలాఖ్) అని చెబితే విడాకులు అయిపోతాయనే భ్రమ ఉంది. అంత తేలిగ్గా ఎవరూ ‘తలాఖ్’ ఇవ్వరు. భార్యా-్భర్తల మధ్య విభేదాలు వస్తే తొలుత భర్త, భార్యలకు సంబంధించిన పెద్ద మనుషుల సమక్షంలో విభేదాలను దూరం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. రెండుసార్లు పెద్దల సమక్షంలో కౌనె్సలింగ్ జరుగుతుంది. అయినా విభేదాలు దూరం కాకపోతే భర్త ఒకసారి ‘తలాఖ్’ ఇవ్వనున్నట్లు భార్యతో ఒకసారి చెబుతారు. అలా ఒకసారి చెప్పిన తర్వాత 30 రోజుల గడువులోగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదరకపోతే, రెండోసారి ‘తలాఖ్’ ఇచ్చేస్తానని చెబుతాడు. రెండోసారి కూడా 30 రోజుల గడువు ఉంటుంది. అయినా మార్పు లేకపోతే మూడోసారి ‘తలాఖ్’ అని మూడుసార్లు చెబుతారు. దీంతో విడాకులు అయిపోతాయి. ఆ తర్వాత ఆమె మళ్లీ పెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆమె మళ్లీ పెళ్ళి చేసుకునేంతవరకు లేదా విడాకులు పొందిన వెంటనే కొంత ‘మెహర్’ (పరిహారం) భర్త ఇస్తారు. ఒకవేళ ఏడేళ్ళలోపు పిల్లలు ఉన్నట్లయితే తల్లి సంరక్షణలో ఉండాలి. వారి ఖర్చులను భర్త చెల్లిస్తారు. పిల్లలు అంతకంటే పెద్ద వారైతే తండ్రి సంరక్షణలోకి రావాలి. వారు తల్లి చెంతనే ఉండాలనుకుంటే ఉండిపోవచ్చు. ‘తలాఖ్’ అనేది శిక్ష కాదు. ‘్ఫఖా’లో భాగం. ప్రధాని మోదీ తన భార్యను మంచిగా చూసుకుంటున్నారా? అనే ప్రశ్న ముస్లిం సమాజం నుంచి ఉత్పన్నమవుతుంది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి చేస్తున్న రాజకీయాల ‘స్టంట్’ అని తెలుస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతిని 99 శాతం మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా వ్యతిరేకిస్తున్నది.

- సయ్యద్ షా హమీద్ హుస్సేన్ శుత్తారీ అధ్యక్షుడు, అఖిల భారత సున్నీ ఉలెమా బోర్టు, హైదరాబాద్