ఫోకస్

ప్రత్యేక చట్టాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి ఉండాల్సిందే. మతం, కులం, స్ర్తి, పురుష అనే వివక్ష లేకుండా ఉమ్మడి పౌర స్మృతి ఉండాలి. హిందూ మతంలో సైతం అభ్యంతరకరమైన అంశాలు ఎన్నో ఉండేవి. అప్పటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్ అభ్యంతరం చెప్పినప్పటికీ జవహర్‌లాల్‌నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ లాంటివారు అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా చట్టాలు చేశారు. కానీ చివరకు ఆ సమయంలో సైతం ముస్లింలకు కొన్ని ప్రత్యేక హక్కులు అన్నట్టుగా వ్యవహరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఇలాంటివి చేశారు. తలాక్ అని మూడుసార్లు చెబితే చాలు విడాకులు ఇచ్చేస్తారు. స్ర్తిని కేవలం సంతానోత్పత్తిగానే చూసే విధానం సరికాదు. షాబానో అనే మహిళకు విడాకులు ఇస్తే, వృద్ధురాలు అయిన ఆమె తన జీవనం కోసం భరణం ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు షాబానోకు జీవించేందుకు నెలకు మూడు వందల రూపాయల భరణం ఇవ్వాలని తీర్పు చెప్పింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పును సైతం అంగీకరించకుండా రాజ్యాంగ సవరణకోసం ఒత్తిడి తీసుకు వచ్చి విజయం సాధించారు. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ వంటి అనేక దేశాల్లో ముస్లింలు ఉన్నారు. మరి అక్కడ ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉంది. మాకు మతం పేరుతో చట్టాలు ప్రత్యేకంగా ఉండాలి అని అక్కడ ముస్లింలు ఎవరూ డిమాండ్ చేయడం లేదు. భారతదేశానికి వచ్చేసరికి మేం ప్రత్యేకంగా మాకు ప్రత్యేక చట్టాలు అని అంటున్నారు. చివరకు ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో సైతం మూడుసార్లు తలాక్ అంటే ఆమోదించరు. ఆర్బిటరీ ఇద్దరి మధ్య రాజీ కుదురుస్తారు. అది సాధ్యం కానప్పుడు మాత్రమే విడాకులను ఆమోదిస్తారు. ముస్లిం దేశాల్లో సైతం లేని ప్రత్యేక హక్కులు కావాలని కోరడం సరికాదు. మైనారిటీలకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేకతలు కల్పించింది. వాటిని ఆమోదిస్తాం కానీ అదే రాజ్యాంగం మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం అంటే అది మాత్రం అంగీకరించం అని కొందరి వాదన. ఇప్పుడు దేశంలో బలమైన నాయకత్వం ఉంది. ఒకే దేశం ఒకే చట్టం అమలు చేయడానికి ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి. దానికి ఇదే సరైన సమయం.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి