ఫోకస్

పరిస్థితి దయనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అన్ని కులాలు, మతాలవారికీ ఒకే విధమైన చట్టం ఉండాలి. ఉమ్మడి పౌరస్మృతి (కామన్ సివిల్ కోడ్) లేకపోవడం వల్ల ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. కేవలం మూడు పర్యాయాలు ‘తలాఖ్’ అని నోటి మాటగా చెప్పేసి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్న భార్యను వదిలించుకోవడం అనేది చాలా దారుణం. అలా ‘తలాఖ్’ పొందిన మహిళ ఆ తర్వాత ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. ఆమె సమాజంలో ఎలా బతకగలదు. భర్త వదిలేసిన మహిళను సమాజం ఏ రకంగా చూస్తుందో, ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచన చేయాలి. ముస్లిం మహిళలు అనాదిగా బాధ పడుతున్నారు. అందుకే కొంతమంది ముస్లిం మహిళలు ధైర్యం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రిపుల్ తలాఖ్ పట్ల తన బాధను వ్యక్తం చేశారు. ఫోన్లో కూడా తలాఖ్ చెప్పేసి వదిలించుకుంటే ఆ మహిళ జీవనం ఎంత దుర్లభంగా ఉంటుందోనని ప్రధాని మోదీ బాధను వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఉన్న వారందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి. హిందు వివాహ చట్టం ప్రకారం విడాకులు పొందడం చాలాకష్టం. వివాహం తర్వాత విడాకులు తీసుకోవాలంటే అంత తేలికైన పనేమీ కాదు. భార్యా-్భర్తల మధ్య చిన్న విభేదాలు వచ్చినట్లయితే భార్యా-్భర్తల తరఫున పెద్ద మనుషులు జోక్యం చేసుకుని వారి సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కూడా వెంటనే కోర్టుకు వెళ్ళమని చేతులెత్తయ్యకుండా భార్యాభర్తలను కలిపే ప్రయత్నమే చేస్తారు. అయినా కుదరని పక్షంలో విడాకులకోసం కోర్టుకు వెళ్ళినా, కోర్టు కూడా ఒకే రోజున తేల్చేయకుండా మళ్లీ ఆలోచన చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, కేసును ఆరు నెలలకు వాయిదా వేయడం జరుగుతుంది. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాతే దాంపత్య జీవనం కుదరదని భావించిన తర్వాతే విడాకులు లభిస్తాయి. కోర్టు గడువు ఇచ్చిన సమయంలో మళ్లీ ఆ జంట ఏకమైన దాఖలాలూ ఉన్నాయి. కాబట్టి ముస్లిం మహిళలు చేసే పోరాటానికి మహిళా మోర్చా మద్దతునిస్తుంది.

- జి. పద్మజా రెడ్డి, అధ్యక్షురాలు, టి.బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా