ఫోకస్

ట్రంప్ విజయం గుబులు పుట్టిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ జాతి సంస్థలు ఎన్ని పెరిగినా, అవి ఎంత లాభాలు గడించినా, సాధారణ ప్రజల సంపద పెరగనిదే ఎవరిలోనూ సంతృప్తి మిగలదు. అమెరికా సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి, అసమానతలతో అసంతృప్తి పెరుగుతోంది, ఉన్నవారు, లేనివారనే అసమతుల్యతలు పెరిగిపోయాయి. కొద్ది మంది శ్రీమంతులు మహాశ్రీమంతులు అవుతున్నారు. మిగిలిన వారు భారతీయ సమాజం మాదిరి ఇబ్బందుల్లోనే ఉంటున్నారు. ఈ కారణంగానే అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం విదేశీయుల్లో గుబులు పుట్టిస్తోంది. దీనికి కారణం ట్రంప్ స్థానిక యువతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడమే, ఆ నిర్ణయం ఇతర దేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఇబ్బందికరమే అవుతుంది. ఎక్కడి వాళ్లకు అక్కడి ఉద్యోగాలు అనే నినాదం ఇపుడు అమెరికాలో ఊపందుకుంది. హైదరాబాద్‌లోనూ మనం అదే నినాదంతో ఉద్యమం చేశాం. మిగిలిన దేశాల్లోని యువత కూడా అదే రీతిలో ఊహించడంలో తప్పేమీ లేదు. అవకాశాలు అన్నీ బయట దేశాలకు చెందినవారికే వెళ్లిపోతుంటే అసంతృప్తి ఎందుకు ఉండదు? అమెరికాలో ఉపాధి కొరత పెరిగిపోతోంది. వాస్తవానికి అమెరికా ప్రజల్లో సంప్రదాయ రాజకీయాలకు, ప్రజల జీవనోపాధి రాజకీయాలకు మధ్య జరిగిన సంఘర్షణగా చెప్పవచ్చు. హిల్లరీ వస్తే భారత్‌కు మరికొంత సానుకూలత ఉంటుందనే మాట నిజమే, కాని స్థానికత సంగతి ఏమిటి? ట్రంప్ విజయంతో కొంత మేర వీసా విధానాల్లో మార్పు తథ్యం. అమెరికా ప్రజలు ట్రంప్‌ను చూసి ఓట్లు వేయలేదు, ఆయన విధానాలు, ప్రకటనలు చూసే ఓట్లు వేశారు. సంప్రదాయ రాజకీయాల అలంకారం, ఆడంబర రాజకీయాలకు చోటులేదని అమెరికా ఫలితాలు తేటతెల్లం చేశాయి. అమెరికాలో సంపద అంతా కేవలం ఒకటి రెండు శాతం ప్రజలవద్దనే ఉందనేది మరో వాస్తవం. రాజకీయ పెనుతుఫాను ఫలితమే ట్రంప్ విజయం. అందుకే దీనిని రాజకీయ భూకంపంగా చెప్పవచ్చు. మిగిలిన దేశాలు అమెరికా వెళ్లి తమకు కూలి దొరికిందనే సంతోషంలో ఉంటున్నా, ఉన్న అవకాశాలు పోయాయనే భావన స్థానిక యువతలో హెచ్చుమీరింది. ఈ పోరాటం నేపథ్యంగా జరిగిన ఎన్నికలు కనుకనే, ట్రంప్ గెలిచాడు. ట్రంప్ కోటీశ్వరుడు, అయినా విలువలు లేవని అమెరికా ప్రజలకు తెలిసినా ఆయన గెలిచాడంటే దానికి కారణం ఆయన మాట తీరు, ఆలోచనలే.

-డాక్టర్ చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ