ఫోకస్

భారత్‌తో ‘బంధం’ పెంచుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు కీలకభూమిక పోషిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల (యుఎస్‌ఎ) అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికైనా భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వకతప్పదు. గతంలో ఆహారం, వాణిజ్యం, వ్యాపారం, శాస్తస్రాంకేతిక రంగాలతోపాటు ఇతర అంశాల్లో చేయూత కోసం అమెరికా వెంట భారత్ పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ వెంట అమెరికా పడాల్సి వస్తోంది. బలమైన శక్తిగా భారత్ మారడమే ఇందుకు కారణం. ఏదైనా కారణంగా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించకపోతే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అమెరికా ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచినా భారత్ విషయంలో సానుకూలంగా ఒకే విధానం అవలంభించక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో వైద్య, విద్య, స్పేస్‌తోసహా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌కు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు అత్యంత కీలకస్థానాల్లో ఉన్నారు. భారతీయులు లేని అమెరికా అభివృద్ధి ఊహించడం సాధ్యం కాదు. రానురాను పరిపాలనా రంగంలో కూడా భారతీయ సంతతికి చెందినవారు చేరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పరిశీలిస్తే హిల్లరీ క్లింటన్ డిప్లోమాట్‌గా వ్యవహరిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎవరికీ నచ్చడం లేదు. అయనప్పటికీ అక్కడి పరిస్థితులను స్థానికులు ట్రంప్‌కు పట్టం కట్టారనిపిస్తోంది. అమెరికాలో ఆసియాకు చెందిన ఓటర్లు మరీ ముఖ్యంగా భారతసంతతికి చెందిన ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునే వ్యక్తిని నిర్ణయించగల స్థాయికి భారత సంతతికి చెందిన ఓటర్లు చేరుకున్నారు. అందువల్ల భారతీయులకు ప్రాధాన్యత లభిస్తోంది. ఈ పరిస్థితిలో ఎవరు గెలిచినా భారతదేశానికి చెందినవారికి గుర్తింపు ఉంటుంది. భారత్‌తో అన్ని రంగాల్లోనూ మెరుగైన సంబంధాల కోసం కొత్త అధ్యక్షుడు చర్యలు తీసుకోవాల్సిందే!

- డాక్టర్ ఎన్. భాస్కర్‌రావు చైర్మన్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్