ఫోకస్

విధానాలు మారవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందినా అక్కడ నివసిస్తున్న మన దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మనదేశం నుంచి వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవలను ఆ దేశం ఉపయోగించుకుంటున్నది. ట్రంప్ ఎన్నికైతే భారత్‌కు చెందినవారిని వెనక్కి పంపిస్తారేమోనన్న అనుమానపు నీడలు అలుముకున్నాయి. అదంతా దుష్ప్రచారమే. అలాచేస్తే అమెరికా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మన భారతీయులే అనేక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ముందు-వెనుక ఆలోచించకుండా ఆదేశించడం అనేది అసాధ్యం. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల గురించి మనం తలమునకలు కావాల్సిన అవసరమే లేదు. అమెరికాకు మతం, దేశం అనే భేధాభిప్రాయాలేమీ లేవు. వారికి కావాల్సింది దేశాభివృద్ధి. అగ్రగామిగా ఉండాలి అనేది ముఖ్యం. కార్పొరేట్ కంపెనీలు తమకు అవసరమైనప్పుడు భారతీయులను పిలిపించుకుంటారు లేకపోతే వద్దంటారు. అమెరికా కంపెనీలు అవసరమైనప్పుడు అధ్యక్షుడిపై వత్తిడి తీసుకుని వస్తాయి. అటామిక్ ఫ్యూల్, హైడ్రోకార్బన్స్ విషయంలో తజకిస్తాన్, లిబియా, ఇరాన్ వంటి దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఎన్‌రాన్ కంపెనీ విషయంలోనూ అదే జరిగింది. అమెరికా దేశ ఎన్నికలు మన దేశం తరహాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమీ జరగవు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్నికైనా విధానాలు ఏమీ మారవు.

- ధరం గురువారెడ్డి కన్వీనర్, తెలంగాణ బిజెపి ఎన్‌ఆర్‌ఐ విభాగం