ఫోకస్

సామాన్యులకు అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. వారి అగచాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి పట్టవా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామంటూ చెప్పినా, ఇప్పటివరకు సామాన్య ప్రజలు బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్ద బారులుతీరి నిలుచుండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు పరిష్కరించడం లేదు? నల్లధనాన్ని నిరోధించడానికి, నకిలీ కరెన్సీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలని తొలుత అందరూ స్వాగతించారు. కానీ వారం రోజులైనా ఇంతవరకు ఒక్క పెద్ద నల్లకుబేరుడినీ బయటకు తేలేదు. దీంతో ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాని మోదీ తనకు సన్నిహితంగా ఉన్నవారికి ముందుగానే సమాచారం చేరవేసి, జాగ్రత్తపడేలా చేశారు. కాబట్టే వారెవ్వరూ ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూలో నిలబడడం లేదు. రిక్షా కార్మికులు, తోపుడుబళ్ల వ్యాపారులు, రోజువారీ కూలీలే తమ వద్ద ఉన్న ఒకటి, అరా నోట్లను మార్చుకునేందుకు నిలబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా తమకు వచ్చిన నెల జీతంలోని పెద్ద నోట్లను మార్చుకునేందుకు క్యూలో నిలబడ్డారు. పెద్దనోట్లను రద్దు చేసి నల్లధనాన్ని నిరోధించాలనుకున్నప్పుడు రెండు వేల విలువ గల నోట్లను మార్కెట్‌లోకి ఎందుకు ప్రవేశపెట్టారు? పెళ్ళిళ్ళు ఆగిపోయి, బలవంతపు మరణాలకు పాల్పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరం.

- మహ్మద్ షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ, టి.శాసనమండలిలో ప్రతిపక్ష నేత