ఫోకస్

పెద్ద నోట్ల రద్దు అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం సమంజసమే. దేశంలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం నకిలీ కరెన్సీపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలన్నీ రూ.500ల నోట్లపైనే ఆధారపడి తమ మనుగడను సాగిస్తున్నాయి. అదేవిధంగా భారత్‌లో కూడా తీవ్రవాదులు, మావోయిస్టుల వద్ద రూ.500ల కరెన్సీ విచ్చలవిడిగా ఉంది. దీంతో పెద్ద నోట్లు అందుబాటులో ఉంటున్నాయని, విదేశాల్లో నకిలీ నోట్ల ముద్రణ కూడా బాగానే జరిగింది. ఓ వైపు బంగ్లాదేశ్, మరోవైపు పాకిస్తాన్‌లు ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తుండడంతో భారత్‌పై దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ కరెన్సీ ముద్రణతో భారత్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి వున్నందున కేంద్రం భారత్‌లో రూ.1000, రూ.500ల కరెన్సీని రద్దు చేయడం హర్షణీయం. కాకపోతే సామాన్యులకు, మధ్యతరగతి, పేద ప్రజానీకానికి ఇబ్బంది కలుగుతోంది. ఇది కేవలం తాత్కాలికమే. పెద్ద నోట్లు రద్దయి వారం రోజులు గడచింది. మరో వారం, పక్షం రోజులు గడిస్తే అన్ని వర్గాల ప్రజలు అలవాటుపడిపోతారు. అయితే ప్రజలు ఊహించినంత నష్టమేమి కలుగదు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వమే ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటోంది. దేశవ్యాప్తంగా హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని పజలు స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవి త్వరలోనే సమసిపోతాయి. కరెన్సీ మార్పిడి, ప్రజల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని నమ్మకం ఉంది. ఇది వాస్తవం కూడా. పెద్ద నోట్ల రద్దుతో సైబర్ నేరాలు తగ్గాయి. దొంగతనాలు, దోపిడీలు, లంచగొండితనం తగ్గింది. ఇళ్ళల్లో డబ్బులున్నాయని ఆందోళనకు గురైన వారికి, టెన్షన్ తగ్గింది. ఇది మన కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ తాత్కాలిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత ఫలితాలను మానుకోకూడదు. ప్రస్తుతం నల్లధనం వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాంది పలికింది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చర్యలు అవసరమవుతాయ. స్మగ్లర్ల కార్యకలాపాలకు కళ్లెం వేసింది. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసింది. దేశంలో అత్యధిక శాతం ఉపాధి, ఉద్యోగాలపై ఆధారపడిన ప్రజానీకానికి ఎంతో మేలు కలుగుతోంది. దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. భారత్‌లో నల్లధనం వెలికితీతపై కేంద్రం ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం, ఇప్పటికైనా తీసుకోవడం మంచిదేననిపిస్తోంది. ఆలస్యమైనా ప్రస్తుతం కేంద్రం తీసుకున్న సమంజసమే. ఇది దేశ భద్రతకు, అభివృద్ధికి ఇటువంటి చర్యలు అవసరం.

- పేర్వారం రాములు మాజీ డిజిపి, తెలంగాణ