ఫోకస్

కేంద్రం చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి మన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు తొలుత ఐ 20 ఇస్తారు. ఆ తరువాత వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అమెరికా చదువుకు భరించే ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అనే అంశాలన్నీ పరిశీలించి వీసా మంజూరు చేస్తారు. వీసా మంజూరు చేసిన తరువాత కూడా ఏవో కుంటి సాకులు చెబుతూ కొందరు విద్యార్థులను అమెరికా విమానాశ్రయం నుంచి తిప్పి పంపడంలో అమెరికా చర్య ఏ మాత్రం సరైనది కాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలి. ఆ విద్యార్థికి అక్కడ చదువుకునే ఆర్థిక స్థోమత లేదు, యూనివర్సిటీకి గుర్తింపు లేదు అని భావిస్తే వీసా దగ్గరే నిలిపివేయాలి. ఒక విద్యార్థి అమెరికాకు వెళ్లడానికి సిద్ధపడి దరఖాస్తు నుంచి విమానంలో అమెరికా చేరుకోవడం వరకు కనీసం ఆరులక్షల రూపాయలు వ్యయం అవుతాయి. అంత డబ్బు ఖర్చు పెట్టిన తరువాత ఏవో కారణాలు చెప్పి వెనక్కి పంపడం దుర్మార్గం. దూరపు కొండలు నునుపు అన్నట్టు అమెరికా చదువు అంటే విద్యార్థుల్లో ఉన్న భ్రమలు తొలిగిపోవాలి. అక్కడ చదువుకోవడం అంటే కొన్ని లక్షల రూపాయల వ్యయంతో కూడుకున్నది. అంత కష్టపడి ఎంఎస్ చేసినా ఆశించిన స్థాయిలో అక్కడ జీవితాలు ఏమీ ఉండడం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉచితంగా చదువు చెప్పించినా అమెరికాపై భ్రమలతో వెళ్లి కష్టాల్లో పడుతున్నారు. అమెరికా చదువు అంటే కనీసం 30 నుంచి 40లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది.
అమెరికాలో యూనివర్సిటీలను బ్లాక్‌లిస్ట్‌లో పెడితే భారత్‌కు ఆ సమాచారం ఇవ్వాలి. వీసా మంజూరు చేసేప్పుడు అక్కడే ఈ యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులను అడ్డుకోవాలి. అదే సమయంలో భారత ప్రభుత్వం సైతం అలాంటి యూనివర్సిటీల వివరాలను విద్యార్థులకు తెలిసే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. వీసా, ఐ 20 ఉన్న తరువాత కూడా విద్యార్థులను ఇంటరాగేషన్ చేసి వెనక్కి పంపిన సంఘటనపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలి. అమెరికా ప్రభుత్వాన్ని ఈ అంశంపై ప్రశ్నించాలి. నిరసన తెలపాలి. దేశం నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుని అక్కడి వరకు వెళ్లిన వారిని తిరిగి పంపినా కేంద్రం స్పందించక పోవడం సరైన పద్దతి కాదు. మరోవైపు విద్యార్థులు సైతం ఆయా విశ్వవిద్యాలయాల గురించి సరైన సమాచారం తెలుసుకొని వెళ్లాలి. కన్సల్టెన్సీల మాయాజాలంలో పడకుండా స్వయంగా విచారించాలి. అన్నిటి కన్నా ముఖ్యం అమెరికా భ్రమలు వీడాలి.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ టిఆర్‌ఎస్