ఫోకస్

ముందస్తు ఏర్పాట్లు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనాన్ని నిర్మూలించేందుకు ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. నల్లధనం నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తూనే, సామాన్యులకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా చర్యలు తీసుకుంటే బాగుండేది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది బడుగు, సామాన్య జీవులు పనులు మానుకొని రద్దయిన పెద్దనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు క్యూ కట్టారు. కొత్త నోట్లకోసం బ్యాంకులు, ఏటిఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నగరాల్లో ఉన్న వారికి ఎటిఎంలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక జీవనంపై పెను ప్రభావం పడుతోంది. చిన్న వ్యాపారులు నలిగిపోతున్నారు. దేశంలో జనాభాకు తగ్గట్టుగా బ్యాంకులు, ఎటిఎంలు లేవు. రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో కొత్తగా ఐదు వందల నోట్ల కరెన్సీ వెంటనే ప్రవేశపెట్టి ఉంటే బాగుండేది. రూ.50, రూ.100 రూపాయల నోట్లు అందుబాటులో లేవు. ప్రజలు సరిపడా నగదు లేక ప్రయాణాలను మానుకున్నారు. పెళ్లిళ్లు పెట్టుకున్నవారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కిందిస్థాయిలో ప్రజలు పడుతున్న బాధలు చెప్పనలవికావు. పార్లమెంటులో ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించబోతున్నాం. నల్లధనం నిర్మూలించాలన్న లక్ష్యం మంచిది. అదే సమయంలో నిజాయితీగా సంపాదించి జీవించే వర్గాలకు ఎక్కువ కాలం ఇక్కట్లు లేకుండా కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి. దేశంలో ఆన్‌లైన్‌ద్వారా ఆర్థిక లావాదేవీలు నగరాల్లో ఉన్న విద్యావంతులకు, కొన్ని వర్గాలకు మాత్రమే తెలుసు. నల్లధనంవల్ల దేశానికి పొంచి ఉన్న ముప్పు గురించి ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించి ఉండాలి. ఈ ఏడాది డిసెంబర్ 30 వరకు రద్దయిన నోట్లను డిపాజిట్ చేయవచ్చు. ఈ విషయమై అవగాహన కల్పించి బ్యాంకుల వద్ద రద్దీ లేకుండా చూడాలి. పేదలకు వాళ్లకు సరిపడా చిల్లర నగదును అందుబాటులో ఉంచాలి. చిల్లర వర్తకులు, సామాన్యులు రోజుకు గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడుతున్నారు. ఎటిఎంలు ఫెయిలవుతున్నాయి. వెంటనే మరమ్మత్తు చేయించే సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఎటిఎంలు నగదు అయిపోయిన వెంటనే నింపే విధంగా ఏజన్సీలకు ఆదేశాలు ఇవ్వాలి. ప్రజల అవసరాలకు సరిపడా నగదును చలామణిలోకి తీసుకురావాలి.

- మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి వైకాపా పార్లమెంటరీ నాయకుడు