ఫోకస్

నిర్ణయం సబబే.. అమలులోనే లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవలసింది. నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడం లేదు, అమలు చేసిన విధానం బాగాలేదు. 120 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో హఠాత్తుగా నోట్లు చెల్లవు అని ప్రకటించడంతో పేదలు, సామాన్యులు, దినసరి కూలీలు ఎలా బతుకుతారు అనే కోణంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. 86శాతం డబ్బు 500, 1000 నోట్ల రూపంలోనే ఉందని కేంద్రమే ప్రకటించింది. ఒకేసారి అంత కరెన్సీ చెల్లుబాటులో లేకపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆకస్మిక నిర్ణయంతో సామాన్యులను ఇబ్బందుల్లో పడేయడానే్న మేం వ్యతిరేకిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వ ఆదాయం కూడా ఆ మేరకు తగ్గిపోతుంది. సామాన్యుల ఇబ్బందులను ప్రధానమంత్రి గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. నల్లకుబేరులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు. 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కొన్ని వేల మంది ఆస్పత్రుల్లో ఉంటారు. అత్యవసర చికిత్సల అవసరం ఏర్పడుతుంది. వారి పరిస్థితి ఏమిటి? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్‌బిఐ గవర్నర్ ప్రకటించాలి. కానీ ప్రధానమంత్రి ప్రకటించడం అనుమానాలు కలిగిస్తోంది. నోట్ల రద్దుతో ప్రభుత్వం పై పడే భారం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాం. అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతాం. స్విస్ బ్యాంకుల్లో ఉన్న మన దేశానికి చెందిన సంపద తిరిగి తెప్పిస్తామని ఎన్నికల్లో బిజెపి వాగ్దానం చేసింది. ఈ అంశంలో ఇప్పటి వరకు ఏం చేశారో? ఎన్ని నిధులు వెనక్కి రప్పించారో ప్రధానమంత్రి ప్రకటించాలి. నల్లధనం నివారించేందుకు వెయ్యి నోట్ల రద్దు అని చెప్పి రెండువేల నోట్లను విడుదల చేశారు. దీనితో నల్లధనం ఎలా అరికడతారో చెప్పాలి? 40 శాతం మంది వరకు నిరక్షరాస్యులు ఉనన దేశంలో అందరికీ బ్యాంకింగ్ అనుసంధానం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చెబుతున్నంతగా ఆచరణలో సులభం కాదు. నోట్ల రద్దు అంశంలో రాష్ట్రంపై పడ్డ ప్రభావంపై చర్చించేందుకు అవసరం అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళతారు, ప్రధానమంత్రితో మాట్లాడతారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యం. సామాన్యుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి.

- పాతూరి సుధాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్