ఫోకస్

నోట్ల రద్దు..జనం పాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్ల పాట్లు ఇప్పట్లో తీరేలా లేదు. కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో పాత 500, వెయ్యి రూపాయల నోట్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో పాటు ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు, తిరిగి నగదు తీసుకునేందుకు ఆంక్షలు విధించడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించిన రాత్రి నుంచే ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆ నిర్ణయాలను తక్షణం అమలులోకి తీసుకురావడంతో సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని అత్యవసర సర్వీసుల విషయంలో మినహాయింపులు ఇచ్చినా, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్ల మార్పిడికి నానా అగచాట్లు పడుతున్నారు. సెలవులు లేకుండా బ్యాంకులు పనిచేస్తున్నా సామాన్యుల బాధలు మాత్రం తీరలేదు. పాత నోట్లను ఖాతాల్లో జమ చేసేందుకు కూడా పరిమితులు ఉండటంతో ధనవంతులు ఇబ్బందులు పడుతుండగా, అసలు డబ్బులు లేక పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నా తొలి మూడు రోజులు రెండు వేల రూపాయలకే పరిమితం కావడం, నేడు పరిమితిని 24వేల రూపాయిలకు పెంచినా, సరిపడా ఎటిఎంలు అందుబాటులో లేకపోవడంతో కొత్త నోట్ల కరవు తీరలేదు. కొత్త నోట్ల సైజ్‌లో తేడా ఉండటంతో ప్రస్తుత ఎటిఎంలలో ట్రేలు సర్దుబాటు కుదరడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రస్తుత ఎటిఎంల సాఫ్ట్‌వేర్ మార్చడంతోపాటు హార్డువేర్ కూడా మార్చాల్సి ఉందనేది వారి వాదన, మధ్యేమార్గంగా మైక్రో ఎటిఎంలు అందుబాటులోకి తెస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటికీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నోట్ల రద్దు వెనుక సకారణాలే ఉన్నాయని అంతా సమర్థిస్తున్నా, నోట్ల రద్దుకు ఇది సరైన తీరు, సమయమూ కాదని వారి వాదన. ముందుగా సరిపడా నోట్లు, ఎటిఎంలను సన్నద్ధం చేసి పాత నోట్లను రద్దు చేసి ఉంటే కార్యాలయాలకు సెలవులు పెట్టి, గంటల తరబడి లైన్లలో నిల్చునే బాధ తప్పేదని అందరి వాదన. ప్రధాని తల్లి సైతం లైన్‌లో నిల్చుని కొత్తనోట్లను తీసుకున్నారనేది స్ఫూర్తిదాయకంగా ఉన్నా, ఈ పరిస్థితిని కూడా నివారించగలిగే వాతావరణం ఉన్నపుడు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయలేదని అవగాహన ఉన్నవారంతా ప్రశ్నిస్తున్నారు. అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు, ఉగ్రవాదుల వద్ద ఉన్న నకిలీ నోట్ల భరతం పట్టేందుకు, నల్లకుబేరుల అంతుచూసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం హర్షణీయమే, కాని దేశంలో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైపోయింది. డాలర్ మారకం ధర విషయంలోనూ రూపాయి తప్పటడుగులు వేస్తోంది. నల్లధనంపై తన పోరాటంలో ఇది ఇంకా ఆరంభమేనని, మున్ముందు చాలా చర్యలను కేంద్రం తీసుకోబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాంతో రేపటి పరిస్థితి ఏమిటో తెలియని అయోమయంలో దేశ ప్రజలున్నారు.