ఫోకస్

వ్యాపారులకు కష్టం.. సర్కారుకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందికి గురికాకుండా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకోసం పనిచేయాల్సినవే. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, ఈ నిర్ణయం వెలువడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. దేశంలోని అన్ని బ్యాంకుల్లో కొత్త కరెన్సీ, చిల్లర డబ్బును అవసరమైన మేరకు అందుబాటులో ఉంచడానికి బృహత్తర ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తే ఎవరికీ ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు ఎదురవుతున్న ఇక్కట్లు ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కుదేలు చేస్తోంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళతాయి. తమ తమ పార్టీలకు ఓట్లువేయమని అడిగేందుకు ఎన్నికల ప్రణాళిక (ఎలక్షన్ మానిఫెస్టో) ద్వారా తమ తమ పార్టీల మనోభావాలను, ప్రజలకోసం ఏం చేయాలని భావిస్తున్నారో మానిఫెస్టోద్వారా తెలియచేస్తారు. ఎవరి మానిఫెస్టోలు తమకు అనుకూలంగా ఉంటాయో వారికి ఓట్లు వేస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే పరిణామం. అధికారంలోకి వచ్చిన పార్టీ తమ మానిఫెస్టో ప్రకారం ప్రభుత్వాన్ని కొనసాగించాలి. అయితే కొన్ని పార్టీలు ఈ మానిఫెస్టోలను పట్టించుకోవు. మరికొన్ని పార్టీలు ఎలక్షన్ మానిఫెస్టోను తు.చ తప్పకుండా పాటిస్తాయి. నల్లధనం వెలికివస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. దినసరి కూలీలకు పనులు లభించడంలేదు. ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నారు. ఒక దుకాణదారుడిని దినసరి సరకులు ఉద్దెరపై ఇవ్వాలని తెలిసిన వారంతా అడిగి తీసుకువెళుతున్నారు. దాంతో దుకాణాల్లో సరకులు అయిపోతున్నప్పటికీ, నగదుమాత్రం రావడం లేదు. ఇలాఉండగా పేదలు, మధ్యతరగతి జనం పెళ్లిల్లు ఇతర కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయంవల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కష్టపడుతుండగా, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండిపడుతోంది.

- ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ కిరాణ వర్తకుల సంఘం