ఫోకస్

గ్రామీణ జీవితం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనం నిర్మూలనకు, జమలేని సొమ్మును నిరోధించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ జీవితం అస్తవ్యవస్తమైంది. కొత్తలో పెద్దనోట్ల రద్దును ఆహ్వానించిన వర్గాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో 75 శాతం మంది వ్యవసాయం మీధ ఆధరాపడి జీవిస్తుంటారు. వీరిలో చాలా మందికి అకౌంట్లు లేవు. ఒకవేళ ఉన్నా, వాటిల్లో కష్టార్జితం ఉంటుంది. చిన్న, మధ్య రైతులు, రైతు కూలీలు, కులవృత్తులు, చిన్న వ్యాపారులు, చిన్న బ్రోకర్లు, చేబదులు ఇచ్చే చిన్న వర్గాలు కేంద్రం నిర్ణయంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామాలు కళతప్పాయి. హైదరాబాద్‌లో ఎటిఎంలు పనిచేస్తే సరిపోతుందా? ఒక బజార్‌లో ఎటిఎంలో డబ్బు లేకపోయినా మరో బజార్లో ఎటిఎంలో సొమ్ము దొరుకుతుంది. దేశంలో 6.39 లక్షల గ్రామాల్లో ఎన్ని బ్యాంకులు, ఎన్ని ఎటిఎంలు ఉన్నాయి. బ్యాంకులు సరిగా పనిచేస్తున్నాయా? తాము దాచుకున్న సొమ్ముపై కేంద్రం ఆంక్షలా? కనీస సొమ్ము రూ.4500కు తగ్గించారా? ఎటిఎంలలో రోజుకు రెండు వేల రూపాయలా? రెండు వేల నోటుకు గ్రామాల్లో చిల్లర దొరుకుతుందా? హోటళ్లు మూతపడ్డాయి. కూరగాయల దుకాణాలు బోసిపోయాయి. గ్రామాలకు బస్సులు రావడం లేదు. నల్లధనాన్ని నిర్మూలించాలని మనమందరం కోరుతున్నాం. కాని ఆచరణలో ఈ స్కీం విఫలమవుతుందనపిస్తోంది. మంచి ఫలితాలు వస్తే జనానికి పంచుతామని ప్రధాని మోదీ అంటున్నారు. ఈ స్కీంను అమలు చేసే ముందు కసరత్తు చేయలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఈ రోజు రోజుకూ పరిమితులను విధించడం, మినహాయించడం చేస్తున్నారు. ఇవన్నీ సామాన్యులకు ఎలా తెలుస్తాయి? డిసెంబర్ 30 వరకు ఆగాలంటే సామాన్యుడి జీవితాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. ఇప్పటికైనా సమయం మించి పోయింది లేదు. నల్లధనం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటూనే, సామాన్య బడుగు జీవులకు ఊరట నిచ్చే చర్యలు తీసుకోవాలి. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు సరఫరా అయ్యే కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారం అతలాకుతలమైంది. ప్రయాణాలు తగ్గాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనం వెళ్లడం తగ్గించారు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకుల్లో వైట్‌మనీ ఉండి, చేతిలో చిల్లగవ్వలేక, ఒకవేళ రెండువేల కరెన్సీ కాగితం ఉన్న చిల్లర లేక గ్రామీణుడు అష్టకష్టాలు పడుతున్నారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చ జరగాలి. విపక్షాలు, అధికార పక్షం మొండికిపోకుండా, దేశంలోని 120 కోట్ల మంది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక మంచి సందేశం ఇవ్వాలి. అమలులో లోపాలు ఉంటే కేంద్రం సరిదిద్దాలి. అలాగే విపక్షం కూడా మొండితనానికి పోయి సమావేశాలకు అంతరాయం కలిగించరాదు.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత