ఫోకస్

అనాలోచిత చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందు చూపు లేకుండా, సంస్కరణలు తేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మట్టికరిపిస్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక అంతిమకాలం దాపురించింది. అధికార గర్వంతో దేశంలోని ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు. నల్లధనాన్ని అరికట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ పెద్దనోట్ల రద్దుకు ముందు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్నది? తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో వేయాలన్నా ఆధార్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు చూపాలనడం, బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవాలనుకున్నా 2 వేలకు మించి ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఏవో శుభకార్యాలో, దూర ప్రయాణాలో చేయాలనుకునేవారు ఆ 2 వేలతో సరిపుచ్చుకోవాలా? అది కూడా గంటల తరబడి క్యూలో నిలుచుంటే తప్ప సాధించలేరు. ఇటువంటివి ప్రశ్నిస్తే దేశద్రోహి అని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. బ్యూరోక్రాట్లు, సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నారని గొప్పగా చెబుతున్నారు. నిజానికి సినీ ఇండస్ట్రీలో కొంతమంది వద్ద నల్లధనం ఉంది. ఆడపిల్ల పుడితే పెరిగి పెద్దదై వివాహం చేసేంత వరకూ కష్టార్జితాన్ని డిపాజిట్ల రూపంలో, బ్యాంకుల్లో జమ చేసుకుంటేనో అది నల్లధనం అని అనడం భావ్యం కాదు. 5 లక్షల కోట్ల నల్లధనం ఉందని చెబుతున్నారు. పెద్దనోట్ల వల్ల నల్లధనం పెరుగుతుందని, తీసుకెళ్ళేందుకు సులభంగా ఉంటుందన్న భావనతో రద్దు చేసినట్లు చెప్పారు. అటువంటప్పుడు 2 వేల రూపాయల నోటు ఎందుకు తీసుకుని వచ్చారంటే దానికి సమాధానం లేదు. సంస్కరణలు తేకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘మీ సేవ’ను ప్రారంభించి సంస్కరణ తీసుకునివచ్చారు. ఎవరైనా ఏదైనా సర్ట్ఫికేట్‌కోసం మీ సేవలో డబ్బు చెల్లించినట్లయితే 78 గంటలలోగా వారికి సర్ట్ఫికేట్ ఇవ్వాలని, ఇవ్వలేకపోతే సంబంధిత అధికారి ఆ సర్ట్ఫికేట్‌కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జరిమానా చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇలా జవాబుదారీతనం ఉండేలా సంస్కరణలు తెచ్చినప్పుడే మార్పు వస్తుంది. అటువంటివి లేకుండా అకస్మాత్తుగా రద్దు అంటే ఎలా? ఇక కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం సర్వసాధారణమే. లోగడ 2004 కంటే ముందు రైతులు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించి రైతుల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడేమో ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటుతో పాటు నోటు కూడా ఇస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి, ఆ పార్టీ మిత్రపక్షాలకూ ప్రజలు గుణపాఠం చెబుతారు.

- మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపి, అధికార ప్రతినిధి, ఎఐసిసి