ఫోకస్

ఎన్డీఏ అడ్రస్ ఇక గల్లంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల రద్దు పేరిట పేద, మధ్య తరగతి ప్రజలను మానసికంగా, శారీరకంగా హింసించారు. దీని పర్యావసానం వచ్చే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అనుభవించక తప్పదు. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేద ప్రజల అకౌంట్లలో లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గొప్పగా ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటు రూపేణా శిక్ష విధిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం ఎలా అరికడతారో ఎవరికీ అర్థం కావడం లేదు. పోనీ అదే నిజం అనుకున్నా, రెండు వేల రూపాయల నోటును చలామణికి తీసుకువచ్చారు. పైగా పరిస్థితులు చక్కదిద్దేందుకు తనకు 50 రోజుల గడువు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను అభ్యర్థించారు. బాగానే ఉంది, అదేవిధంగా తమ వద్ద ఉన్న పాత నోట్లను చలామణి చేసుకోవడానికి 50 రోజుల గడువు తమకు ఎందుకు ఇవ్వరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేసిన నోట్ల చలామణిని 50 రోజులపాటు కొనసాగించాలి. ప్రజాజీవనం స్తంభించింది. మార్కెట్లు దివాళా తీసాయి. నల్లధనం వెనక్కి తీస్తామని ఇంతకాలం ప్రధాని ప్రగల్భాలు పలికి, ఇప్పుడేమో వారే తనను చంపేస్తారేమోనని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రధానిగా ఉన్న వ్యక్తే ఆ విధంగా మాట్లాడితే దేశ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది. పెద్దనోట్లను రద్దు చేయడానికి ముందే కుబేరులు కొన్ని వందల కోట్ల రూపాయల బంగారాన్ని ఖరీదు చేయడం జరిగింది. రద్దు విషయం వారికి ఎలా తెలిసింది? రద్దు విషయాన్ని టిడిపి, బిజెపి ముఖ్య నాయకులకు, కొంతమంది కుబేరులకు ముందే తెలిసిందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు నల్లధనం ఉన్నవాళ్ళు తమ సిబ్బంది అకౌంట్లలో, బంధుమిత్రుల అకౌంట్లలో రద్దయిన నోట్లను జమ చేస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎలా అరికడుతుంది? పక్కా ప్రణాళిక లేనందుకే దీనిని అరికట్టలేకపోయింది. చివరకు సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే జరిగిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నోట్లతో ఇన్ని కష్టాలు పడి ఆగ్రహంగా ఉన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓట్లతో బిజెపి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు.

- సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ