ఫోకస్

ఇప్పుడే ఏం చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్ల రద్దుతో ఏ రంగంపై ఎలాంటి ప్రభావం పడబోతుందో, ఏ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పటికి ఇప్పుడే చెప్పలేం. ఏ ఆర్థిక వేత్త కూడా వంద శాతం ఇలానే జరుగుతుంది అని చెప్పలేరు. ఏ మంచి పని చేయాలన్నా వంద శాతం మంచే జరుగుతుంది అని చెప్పలేం. ప్రభావం ఏ విధంగానైనా ఉండవచ్చు. దొంగ సొమ్ము, నల్ల ధనం దేశానికి, సమాజానికి మంచిది కాదు. దేశంలో నల్లధనం బాగా పేరుకు పోయింది, దాన్ని తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. నల్లధనం నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల దొంగ కరెన్సీని నిర్వీర్యం చేయగలిగారు. దీని తక్షణ ప్రభావం కనిపిస్తోంది. కాశ్మీర్‌లో ఇంత కాలం జరిగిన దాడుల సంఘటనలు హఠాత్తుగా నిలిచిపోయాయి. హింసాత్మక సంఘటనలు జరగడం లేదు. దేశంలోని నకిలీ కరెన్సీ కూడా నిలిచిపోయింది. నోట్ల రద్దుపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్‌బిఐ గవర్నర్ ఈ ముగ్గురికి మాత్రమే పెద్ద నోట్ల రద్దు గురించి ముందుగా తెలుసు అనుకుంటున్నాను. నోట్ల రద్దుపై మొత్తం దేశంపై పడే ప్రభావం వీళ్లు పూర్తిగా అంచనా వేసి ఉండక పోవచ్చు. అయితే సమస్యలు తమ దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకుని ఉపశమనం కలిగేట్టు చేస్తున్నారు. ఏయ రంగాలపై ప్రభావం ఎలా ఉంటుంది? పర్యవసానం ఏమిటి? ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏమిటీ అనేది పూర్తిగా అంచనా వేసినట్టు అనిపించడం లేదు. దాని వల్ల సమస్యలు తలెత్తడం, ప్రజలకు ఇబ్బందులు కలగడం సహజమే. బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు, ఎటిఎంలు పని చేయక పోవడం, నగదు అందుబాటులో లేక పోవడం వల్ల చిల్లర వ్యాపారం నిలిచిపోవడం వంటివి నిజమే. ఈ ఇబ్బందులను ముందుగానే ఊహించి వంద రూపాయల కరెన్సీని పెద్ద మొత్తంలో ముద్రించి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సింది. పల్లెల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా జీతాలు రాగానే మొదటి వారంలో చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు పూర్తయిన తరువాత నోట్ల రద్దు ప్రకటన చేయడం వల్ల మేలు జరిగింది. రేపటి వెలుగు కోసం జైలుకు వెళ్లారు. ఇప్పుడు కూడా అంతే రేపటి వెలుగు కోసం ఈ సమస్యలు భరించాలి. రెండు వారాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో క్రమంగా తెలుస్తుంది.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి