ఫోకస్

రాష్ట్రా లకు నష్టమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబర్ 8వ తేదీ రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనల ఉప్పెన సునామిగా మారింది. నగదు మార్పిడి ఒక పెద్ద సమస్యగా , బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలతో అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్న నగదు మార్చుకోవాలన్నా, బ్యాంకుల్లో ఉన్న నగదు ఉపసంహరించుకోవాలన్నా చాంతాడంత క్యూలలో జనం నిల్చుని సిగపట్లు పడుతున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకాకముందే నష్టనివారణ చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, కేరళ, పశ్చిమబంగా రాష్ట్రాలు నోట్ల రద్దుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నోట్ల రద్దుతో మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయని, రాష్ట్రాలకు రావల్సిన ఆదాయం తగ్గిందని, తద్వారా రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి వచ్చిందనేది వారి వాదన. ఆర్‌బిఐ లెక్కల ప్రకారం దేశంలో కరెన్సీ 16,415 బిలియన్లు. ఇందులో 500 నోట్లు 47.8 శాతం, వెయ్యి నోట్లు 38.6 శాతం ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఉండాల్సిన నగదు కంటే 86 శాతం అదనపు నగదు ఉన్నట్టు ఆర్‌బిఐ గుర్తించింది. అంటే ఈ 86 శాతం నకిలీ నోట్లనేది సుస్పష్టం.
నోట్ల రద్దు తర్వాత దేశంలో ఎదురైన సమస్యలపై కేంద్రప్రభుత్వం, ఆర్‌బిఐ ఎప్పటికపుడు చర్యలు చేపడుతునే ఉన్నా, తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్ల స్థాయి అధికారులు ఇద్దరు ముగ్గురిని ఒక కమిటీ కింద వేస్తారు. ఈ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను పర్యటించి, అక్కడి ప్రభుత్వాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విచారణ జరిపి ఆ అంశాల వారీ ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని కేంద్రం యోచించింది.
ఏ విధంగా చూసినా నోట్ల పాట్లు ఇప్పట్లో తీరేలా లేదు. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణం అమలులోకి తీసుకురావడంతో సామాన్యులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన సడలింపులు మాత్రం అమలుచేయడంలో బ్యాంకర్లు దిక్కులు చూస్తున్నారు. కొన్ని అత్యవసర సర్వీసుల విషయంలో మినహాయింపులు ఇచ్చినా, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్ల మార్పిడికి వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సెలవులు లేకుండా బ్యాంకులు పనిచేస్తున్నా సామాన్యుల బాధలు మాత్రం తీరలేదు.
పాత నోట్లను ఖాతాల్లో జమ చేసేందుకు కూడా పరిమితులు ఉండటంతో ధనవంతులు ఇబ్బందులు పడుతుండగా, అస్సలు డబ్బులు లేక పేదవారు ఇబ్బంది పడుతున్నారు. అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు, ఉగ్రవాదుల వద్ద ఉన్న నకిలీ నోట్ల భరతం పట్టేందుకు, నల్లకుబేరుల అంతుచూసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం హర్షణీయమే, కాని దేశంలో ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైపోయింది. జనం వద్ద డబ్బు బ్యాంకులకు చేరుతున్న మాట నిజమే అయినా మార్కెట్లు భేర్ మంటున్నాయి. ఈ పరిస్థితుల్లో నోట్ల రద్దు వల్ల ప్రభుత్వాలు, మార్కెట్లపై ప్రభావం గురించి నిపుణుల అభిప్రాయాలు ఈ వారం ఫోకస్‌లో...