ఫోకస్

అయినా.. అవినీతి ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన అవినీతి అగదు.. నకిలీ కరెన్సీ బెడద తప్పదు.. భారత్‌ను అవినీతిరహిత దేశంగా చూడాలనే కరెన్సీ మార్పు జరిగిందని భావిద్దాం. అయతే నల్లధనాన్ని వెలికి తీసినంత మాత్రాన దేశంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అనుకోవడానికి లేదు. రూ. వెయ్యి, ఐదువందల కరెన్సీ రద్దయి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కశ్మీర్, గుజరాత్‌లోనూ రెండువేల రూపాయల నకిలీ నోట్లు బయటపడ్డాయి. అధికారులు కొత్తనోట్లను లంచంగా తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలోనూ రెండువేల రూపాయల నోట్లను ముద్రించి ప్రజలను మోసగిస్తున్నారు. పెద్దనోట్లు రద్దయి పదిహేను రోజులు గడచినప్పటికీ వాటిస్థానంలో కనీసం 20 శాతం కొత్త కరెన్సీని కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు.. ప్రజలకు ఎదురయ్యే కష్టాలను గుర్తించలేదు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం వాస్తవమే. అయనప్పటికీ పెద్ద కరెన్సీ రద్దుతో కొంతవరకైనా అవినీతిని అడ్డుకట టపడుతుందని ఆశిద్దాం. నల్లకుబేరుల ధనం పేదలకు ఉపయోగపడొచ్చు. నల్లధం మొత్తాన్నీ ప్రభుత్వం లాక్కోదు. బ్లాక్‌మనీపై విధించిన పన్నునే పేదల ఖాతాకు మళ్లించాలని కేంద్రం ఆలోచన. ఇకపోతే పెద్దనోట్ల రద్దు రాష్ట్రాలపై భారీగానే ప్రభావం చూపుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆర్థికంగా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. రియల్ బూమ్ రెండు, మూడేళ్లయినా తనస్థాయి నిలబెట్టుకోలేదు. దీంతో పేద, మధ్య తరగతి వారికి కొంత మేలు జరగొచ్చు. పరిశ్రమలు, ఉద్యోగులకు కూడా కొంత మేరకు నష్టమే. ప్రైవేటు సంస్థలన్నీ ఆర్థికంగా నష్టపోక తప్పదు. దీనికి కరెన్సీ కొరతే ప్రధాన కారణం. బ్యాంకులు నిర్దేశించిన మేరకు డబ్బులు అందించలేకపోతున్నాయి. ఇది కష్టమే, కానీ ప్రజలు కొంత పొదుపును అలవర్చుకునే అవకాశం ఉంది. తాత్కాలిక ఇబ్బందులను అధిగమిస్తే.. శాశ్వత ఫలితాలు దక్కుతాయని భావిస్తున్నాం.

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ అధ్యక్షుడు